‘సీతారామం’ చిత్రంతో తెలుగు ప్రేక్షకులకు చేరువైంది మరాఠీ భామ మృణాల్ ఠాకూర్. ఇటీవల విడుదలైన ‘హాయ్ నాన్న’ సినిమాలో ఆమె అభినయానికి చక్కటి ప్రశంసలు దక్కాయి. ఈ నేపథ్యంలో ఈ భామ సినిమాల వేగాన్ని పెంచింది. భారీ అవకాశాలను సొంతం చేసుకుంటూ దూసుకుపోతున్నది. తాజా సమాచారం ప్రకారం రాఘవ లారెన్స్‌తో ఈ అమ్మడు జోడీ కట్టబోతున్నట్లు తెలిసింది.
వివరాల్లోకి వెళితే.. రాఘవ లారెన్స్ హీరోగా దర్శకుడు రమేష్‌వర్మ ఓ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నాడు. ఇందులో కథానాయిక పాత్రకు చక్కటి ప్రాధాన్యత ఉంటుందని తెలిసింది. బలమైన సంఘుర్షణతో కూడిన ఈ పాత్ర కోసం మృణాల్ ఠాకూర్‌ను ఎంపిక చేశారని తెలిసింది. ఈ చిత్రానికి ‘శ్రీరామరక్ష’ అనే పేరును పరిశీలిస్తున్నట్లు సమాచారం. ప్రస్తుతం మృణాల్ ఠాకూర్ తెలుగులో విజయ్ దేవరకొండ సరసన ‘ఫ్యామిలీ స్టార్’ అనే చిత్రంలో నటిస్తున్నది. హిందీలో ‘పూజా మేరీ జాన్’ అనే సినిమా చేస్తున్నది.