Mrunal Thakur | తెలుగు ప్రేక్షకులకు పెద్దగా ఇంట్రడక్షన్ అవసరం లేని భామ మృణాళ్ ఠాకూర్ (Mrunal Thakur). ఈ భామ ప్రస్తుతం టాలీవుడ్ హీరో అడివిశేష్ (Adivi Sesh) నటిస్తోన్న డెకాయిట్ (Dacoit)లో హీరోయిన్గా నటిస్తోంది. మరోవైపు బాలీవుడ్ యాక్టర్ అజయ్ దేవ్గన్ నటిస్తోన్న సన్ ఆఫ్ సర్దార్ 2లో ఫీ మేల్ లీడ్ రోల్లో నటిస్తోంది.
ప్రొఫెషనల్‌గా బిజీగా ఉన్న ఈ సుందరి తన వ్యక్తిగత జీవితం గురించి చెప్పిన మాటలు ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతున్నాయి. ఏంటీ మృణాళ్ ఠాకూర్ షేర్ చేసింది పెళ్లి విషయమా.. ఏంటని ఆలోచిస్తున్నారా..? అయితే మీరనుకుంటున్నది నిజమే. కపిల్ శర్మతో చేసిన మృణాళ్ ఠాకూర్ చిట్‌చాట్‌లో ఇంట్రెస్టింగ్ విషయాన్ని వెల్లడించింది.
తాను పెళ్లి చేసుకోవడం, పిల్లలను కనే విషయంలో చాలా ఆసక్తిగా ఉన్నట్టు వెల్లడించింది మృణాళ్ ఠాకూర్. అంతేకాదు తల్లి కావడం తనకు ఎప్పటి నుంచో ఉన్న కల అని కూడా చెప్పుకొచ్చింది. అయితే ఇప్పుడు మాత్రం పెళ్లికి సంబంధించి ఎలాంటి ప్లాన్ లేదని.. ప్రస్తుతానికి ఫోకస్ అంతా కెరీర్‌పైనే పెట్టానని స్పష్టం చేసింది. ఇక నిజాయితీ తన మనసులో మాట బయటపెట్టిన మృణాళ్ ఠాకూర్‌పై అంతా ప్రశంసలు కురిపిస్తున్నారు.
షనీల్ డియో కథనందిస్తూ దర్శకత్వం వహిస్తున్న డెకాయిట్ డిసెంబర్ 25న విడుదల కానుంది. డెకాయిట్ నుంచి రిలీజ్ చేసిన పోస్టర్లో మృణాల్ ఠాకూర్ ఓ చేత్తో స్టీరింగ్ తిప్పుతూ.. మరోచేతిలో పిస్తోల్ పట్టుకొని కనిపిస్తుంది. పక్కనే అడివి శేష్ సిగరెట్ వెలిగిస్తున్నాడు. హీరోహీరోయిన్లిద్దరూ ఏదో మిషన్‌లో పాల్గొంటున్నట్టుగా ఉన్న ఈ పోస్టర్ డెకాయిట్‌లో సినిమాపై క్యూరియాసిటీ పెంచేస్తుంది. మృణాళ్ ఠాకూర్ మరో నాలుగు సినిమాలను కూడా లైన్లో పెట్టింది.
Nithya Menen | తనను రతన్ టాటాతో పోల్చుకున్న నిత్యమీనన్.. ఇంతకీ ఏ విషయంలోనో తెలుసా..?
Ustaad Bhagat Singh | వారంలో పూర్తి.. ఉస్తాద్ భగత్ సింగ్‌పై పవన్ కల్యాణ్ కామెంట్స్ వైరల్