దక్షిణాది అగ్రనటుడు ధనుష్‌తో మృణాల్ ఠాకూర్ ప్రేమలో ఉందనే వార్తలు ప్రస్తుతం ముంబయి సినీ వర్గాల్లో హాట్‌టాపిక్‌గా మారాయి. వీరిద్దరి డేటింగ్‌పై ఆంగ్ల మీడియాలో కథనాలొస్తున్నాయి. ఈ జంట ప్రేమబంధానికి కొద్ది మాసాల క్రితమే బీజం పడిందని అంటున్నారు. ఇటీవల జరిగిన ‘సన్ ఆఫ్ సర్దార్ 2’ ప్రీరిలీజ్ ఈవెంట్‌కు ధనుష్ అతిథిగా హాజరయ్యారు.
ఈ కార్యక్రమంలో ఆయన మృణాల్తో చనువుగా ఉన్న వీడియోలు సోషల్‌మీడియాలో వైరల్‌గా మారాయి. కొన్ని నెలల క్రితం చెన్నైలో జరిగిన ఓ సినిమా ఈవెంట్లో ధనుష్, మృణాల్ మధ్య తొలిసారి పరిచయం ఏర్పడిందని, అక్కడే వీరి ప్రేమప్రయాణానికి తొలి అడుగులు పడ్డాయని అంటున్నారు. ధనుష్ సోదరీమణులు కార్తీక, విమల గీత ఇన్‌స్టాగ్రామ్‌లో మృణాల్ ఠాకూర్‌ను ఫాలో కావడంతో డేటింగ్ వార్తలకు మరింత బలం చేకూరినట్లయింది.
ధనుష్ తన కుటుంబ సభ్యులకు మృణాల్ ఠాకూర్‌ను పరిచయం చేశారని అంగ్ల మీడియాలో వార్తలొచ్చాయి. తమ ప్రేమబంధంపై ప్రస్తుతం ఈ జంట గోప్యతను పాటిస్తున్నారని, సరైన సమయంలో అందరికి తెలియపరిచే ఆలోచనలో ఉన్నారని సమాచారం.గత కొద్దిరోజులుగా మీడియాలో వస్తున్న డేటింగ్ వార్తలపై ఈ తారలిద్దరూ ఇప్పటివరకూ స్పందించలేదు. దాంతో డేటింగ్ రూమర్స్ నిజమేనని అభిమానులు భావిస్తున్నారు.