కథానాయిక మృణాల్ ఠాకూర్ డేటింగ్ రూమర్స్ ఇటీవలికాలంలో సోషల్‌మీడియాలో వైరల్‌గా మారాయి. తమిళ హీరో ధనుష్‌తో ఈ అమ్మడు ప్రేమాయణం సాగిస్తున్నదని వార్తలు రాగా.. వాటిని ఆమె ఖండించింది. ధనుష్ తన బెస్ట్‌ఫ్రెండ్ అని స్పష్టతనిచ్చింది. అయితే ఈ భామ డేటింగ్ రూమర్స్‌కు ఇప్పట్లో ఫుల్స్టాప్ పడేలా లేదు. తాజాగా టీమిండియా క్రికెటర్ శ్రేయస్ అయ్యర్‌తో మృణాల్ డేటింగ్ చేస్తున్నదని సోషల్‌మీడియాలో విస్తృతంగా ప్రచారం జరుగుతున్నది. వీటిపై ఓ ఇంటర్వ్యూలో క్లారిటీ ఇచ్చింది మృణాల్ ఠాకూర్.
ఇలాంటి పుకార్లు రావడం రోటీన్‌గా మారిందని, వాటిని చూసి నవ్వుకోవడం మినహా ఏం చేయలేమని పేర్కొంది. ‘ఎవరో టైమ్‌పాస్ కోసం ఇలాంటి రూమర్స్‌ను వ్యాప్తి చేస్తుంటారు. వాటిని చూసి నేను నవ్వుకుంటాను. గుర్తింపు కోసం కొందరు వ్యక్తులు చేసే పబ్లిసిటీ స్టంట్స్ ఇవి’ అని మృణాల్ ఠాకూర్ వ్యాఖ్యానించింది. ప్రస్తుతం ఈ భామ అడివి శేష్ సరసన ‘డెకాయిట్’ చిత్రంలో నటిస్తున్నది. దీనితో పాటు అల్లు అర్జున్-అట్లీ కాంబోతో రూపొందుతున్న చిత్రంలో ఓ నాయికగా ఎంపికైనట్లు సమాచారం.