కథానాయిక మృణాల్‌ఠాకూర్ రేచీకటితో బాధపడుతున్నదట. ఆ విషయాన్ని దాచేసి, వరుడిని వెతికేపనిలో ఉన్నారంట ఆమె కుటుంబసభ్యులు. ఏంటీ.. ఇదంతా నిజమే అనుకుంటున్నారా? విషయం ఏంటంటే, ఆమె బాలీవుడ్లో ‘ఆంఖ్ మిచోలీ’ అనే సినిమా చేస్తున్నది. అందులో మృణాల్‌కి రేచీకటి. ఆ విషయాన్ని దాచి వరుడుకోసం వెతుకుతుంటారు కుటుంబసభ్యులు.
ఈ విషయాన్ని ఓ ఇంటర్వ్యూలో బయటపెట్టింది మృణాల్. ఈ తరహా పాత్ర చేయడం ఇదే ప్రథమమని, నటిగా తనకిది ఛాలెంజ్ అని మృణాల్ అన్నది. సినిమాల్లో సరే, నిజంగా మీ పెళ్లెప్పుడు? అనడిగితే. ‘నా కుటుంబం నుంచి ఒత్తిడి ఎక్కువగానే ఉంది. కాకపోతే నన్ను భరించేవాడు అసలు ఉన్నాడా అనేది నా డౌట్’ అంటూ నవ్వేసింది మృణాల్.