గురుచరణ్ నేతి, జుహీ భట్, అమిషి రాఘవ్ ప్రధాన పాత్రధారులుగా రూపొందుతున్న మ్యూజికల్ లవ్ ఎంటైర్టెనర్ ‘మిస్టర్ రోమియో’. ‘ఏ రీల్ లైఫ్ స్టోరీ’ అనేది ఉపశీర్షిక. మనోజ్‌కుమార్ కటోకర్ దర్శకుడు. నేతి శ్యామ్‌సుందర్ నిర్మాత. నిర్మాణం పూర్తి కావొచ్చిన ఈ చిత్రం త్వరలో విడుదల కానుంది. ఈ సందర్భంగా టీజర్ లాంచ్ ఈవెంట్‌ను హైదరాబాద్‌లో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి అతిథిగా విచ్చేసిన నటి శ్రియా శరణ్ టీజర్‌ని ఆవిష్కరించి చిత్రయూనిట్‌కి శుభాకాంక్షలు అందించారు.
దర్శకుడు కరుణకుమార్ మరో అతిథిగా విచ్చేసి చిత్ర యూనిట్‌కు ఆల్ ది బెస్ట్ చెప్పారు. సినిమా ఆల్మోస్ట్ పూర్తయిందని, ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ జరుగుతున్నదని, మరో నెలలో విడుదల చేస్తామని, యువతరానికి నచ్చే సినిమా ఇదని దర్శకుడు మనోజ్‌కుమార్ తెలిపారు. ఎస్.కె.ఖాదర్, నవనీత్ బన్సాలి, కుల్దీప్ రాజ్ పురోహిత్ తదితరులు ఇతర పాత్రలు పోషిస్తున్న ఈ చిత్రానికి కథనం, మాటలు: చైతన్య గరికిన, కెమెరా: చందు సి.ఎస్.ఆర్, సంగీతం: ప్రజ్వల్ క్రిష్.