దర్శక, నిర్మాత రమేశ్‌వర్మ ఆర్వి ఫిల్మ్ హౌస్ అనే చిత్ర నిర్మాణ సంస్థను స్థాపించి తొలి ప్రయత్నంగా నిర్మిస్తున్న చిత్రం ‘కొక్కొరొకో’. కొత్త తారలు నటించనున్న ఈ చిత్రం ద్వారా శ్రీనివాస్ వసంతల దర్శకునిగా పరిచయం కానున్నారు. ఈ చిత్రం ప్రారంభోత్సవం ఆదివారం హైదరాబాద్‌లో ఘనంగా జరిగింది. ముహూర్తపు సన్నివేశానికి నిర్మాత రేఖవర్మ క్లాప్ ఇవ్వగా, మరో నిర్మాత కూరపాటి శిరీష కెమెరా స్విచాన్ చేశారు.
దర్శక,నిర్మాత రమేశ్‌వర్మ స్క్రిప్ట్‌ను దర్శకుడు శ్రీనివాస్ వసంతలకు అందజేశారు. కథ, స్క్రిన్‌ప్లే రమేశ్‌వర్మ అందించిన ఈ చిత్రానికి దేవిశ్రీప్రసాద్ సోదరుడు, ప్రముఖ నేపథ్య గాయకుడు జి.వి.సాగర్ మాటలు రాస్తుండటం విశేషం. రెగ్యులర్ షూటింగ్ తర్వలో ప్రారంభం కానున్నదని మేకర్స్ తెలిపారు. ఈ చిత్రానికి కెమెరా: ఆకాష్ ఆర్.జోషి, సంగీతం: సంకీర్తన్, సహ నిర్మాత: నీల్లాద్రి ప్రొడక్షన్స్, నిర్మాతలు: రేఖవర్మ, కూరపాటి శిరీష.