అగ్ర హీరో నాని కథానాయకుడిగా రూపొందుతున్న యాక్షన్ ఎంటైర్టెనర్ ‘ది ప్యారడైజ్’. ‘దసరా’ఫేం శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో సుధాకర్ చెరుకూరి అత్యంత ప్రతిష్టాత్మకంగా ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఇప్పటికే విడుదల చేసిన ప్రచార చిత్రాలు సినిమాపై బజ్‌ని క్రియేట్ చేశాయి. ఈ సినిమాను మొదట్నుంచీ రీజనల్ సినిమాలా కాకుండా, పాన్ వరల్డ్ సినిమాలా ట్రీట్ చేస్తున్నారు మేకర్స్.
ఇందులో భాగంగా హాలీవుడ్‌కు చెందిన ఓ కంటెంట్ క్రియేటివ్ కంపెనీతో ‘ది ప్యారడైజ్’ టీమ్ కొలాబరేట్ కానున్నారు. అంతేకాకుండా, ఈ సినిమాను ప్రపంచవ్యాప్తంగా తీసుకెళ్లేందుకు ఇండియాలో భారీ సంఖ్యలో ఫాలోవర్స్ కలిగి ఉన్న ప్రఖ్యాత హాలీవుడ్ నటుడ్ని ఈ సినిమాలో నటింపజేయనున్నారు. దానికి సంబంధించిన చర్చలు జరుగుతున్నాయి.
విషయాన్ని ఆదివారం ఓ ప్రకటన ద్వారా తెలియజేశారు. వచ్చే ఏడాది మార్చిలో ప్రపంచవ్యాప్తంగా తెలుగు, హిందీ, తమిళం, కన్నడ, మలయాళం, బెంగాలీ, ఇంగ్లిష్, స్పానిష్.. ఇలా మొత్తం ఎనిమిది భాషల్లో ‘ది ప్యారడైజ్’ విడుదలకానుంది. బాలీవుడ్ యాక్టర్ రాఘవ్ జుయాల్ కీలక పాత్ర పోషిస్తున్న ఈ చిత్రానికి కెమెరా: సి.హెచ్.సాయి, సంగీతం: అనిరుధ్ రవిచందర్, నిర్మాణం: ఎస్ఎల్వీ సినిమాస్.