సముద్రఖని ముఖ్య పాత్రలో రూపొందిన చిత్రం ‘మిస్టర్ మాణిక్యం’. నంద పెరియసామి దర్శకుడు. జి.పి.రేఖా రవికుమార్, చింతా గోపాలకృష్ణారెడ్డి, రాజా సెంథిల్ నిర్మాతలు. డిసెంబర్ 28న సినిమా విడుదల కానుంది. నిర్మాత, పంపిణీదారుడు ఏషియన్ సునీల్ నారంగ్ చేతుల మీదుగా ఈ సినిమా ఫస్ట్‌లుక్ అండ్ రిలీజ్ డేట్ పోస్టర్ని ఆదివారం జరిగిన ఓ కార్యక్రమంలో లాంచ్ చేశారు. ఈ సందర్భంగా చిత్ర యూనిట్‌కు సునీల్ నారంగ్ శుభాకాంక్షలు అందించారు.
సముద్రఖని మాట్లాడుతూ ‘ ‘విమానం’ తర్వాత నేను లీడ్ రోల్ చేసిన సినిమా ఇది. ‘విమానం’ నాకు మంచి పేరు తెచ్చింది. ‘మిస్టర్ మాణిక్యం’ అంతకు మించిన పేరు తెస్తుందని నా నమ్మకం. మానవతా విలువలే ఈ సినిమా ప్రధానాంశం.’ అని తెలిపారు. సముద్రఖనితోపాటు నాజర్, భారతీరాజా ఇలా మహామహులు ఈ సినిమాకు పనిచేశారని, నిర్మించిన మాతోపాటు పనిచేసిన అందరూ ఈ సినిమా విషయంలో సంతృప్తితో ఉన్నారని నిర్మాతలు తెలిపారు.
ఈ కార్యక్రమంలో అతిథిగా పాల్గొన్న నిర్మాత శివలెంక కృష్ణప్రసాద్ చిత్ర యూనిట్‌కు శుభాకాంక్షలు అందించారు అనన్య కథానాయికగా నటించిన ఈ చిత్రంలో తంబి రామయ్య, ఇళవరసు, వడివుక్కరసి తదితరులు ఇతర పాత్రధారులు. ఈ చిత్రానికి కెమెరా: ఎం.సుకుమార్, సంగీతం: విశాల్ చంద్రశేఖర్.