Mr Bachchan Movie | మాస్ మహారాజ రవితేజ, దర్శకుడు హరీశ్ శంకర్ కాంబోలో వచ్చిన తాజా చిత్రం ‘మిస్టర్ బచ్చన్’ (Mr Bachchan). ‘నామ్ తో సునా హోగా’ అనేది ఈ సినిమా ట్యాగ్‌లైన్. షాక్, మిరపకాయ్ వంటి సూపర్ హిట్ సినిమాల తర్వాత రవితేజ, హరీశ్ శంకర్ కాంబోలో ఈ సినిమా రావడంతో మూవీపై భారీ అంచనాలు ఉన్నాయి. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్‌పై టీజీ విశ్వప్రసాద్ ఈ సినిమాను నిర్మించగా.. భాగ్యశ్రీ బోర్సే హీరోయిన్గా నటించింది. ఇండిపెండెన్స్ కానుకగా ఈ చిత్రం నేడు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. అయితే ఈ సినిమా ఫస్ట్ షో నుంచే మిక్స్డ్ టాక్ రావడంతో సోషల్ మీడియాలో విపరీతంగా ట్రోల్ చేస్తున్నారు అభిమానులు.
ఈ క్రమంలోనే ఆర్టీసీ క్రాస్ రోడ్స్‌లో మిస్టర్ బచ్చన్ సినిమా చూసిన రవితేజ అభిమాని దర్శకుడు హరీశ్ శంకర్‌పై సంచలన వ్యాఖ్యలు చేశాడు. ఒక మీడియా ఛానల్ అభిమానులను రివ్యూ అడుగుతుండగా.. రవితేజ అభిమాని వచ్చి సినిమా యావరేజ్‌గా ఉందని.. హరీశ్ శంకర్ దర్శకత్వం ఫ్లాప్ అయ్యిందని తెలిపాడు. హరీశ్ శంకర్ ఇప్పుడు ఆర్టీసీ క్రాస్ రోడ్స్‌కి వస్తే అభిమానులు అతడిని కొట్టేస్తారు. రవితేజ అభిమానిగా చెబుతున్నా సినిమాలో కంటెంట్ ఉంది కానీ డైరెక్షన్ మిస్ అయ్యింది. పాటల కోసం సినిమా తీసినట్లు ఉంది. స్టార్ దర్శకుడి అయ్యి ఇలా తీయడం నచ్చలేదు. హరీశ్ శంకర్ ఆర్టీసీ క్రాస్ రోడ్స్‌కి రాకండి.. ఒకవేళ మీరు ఇక్కడికి వస్తే ఫ్యాన్స్ మిమ్మల్ని కొడతారు అనుకుంట ఆవేదన వ్యక్తం చేశాడు.
Harish Shankar Rtc X Roads ki vaste kodatam. pic.twitter.com/bJgoDxDA7c
— At Theatres (@AtTheatres) August 14, 2024
Also read..