హైదరాబాద్ : అంబర్పేటలో(Amberpet) భారీ అగ్నిప్రమాదం(Huge fire) చోటు చేసుకుంది. భారీగా మంటలు ఎగిసిపడుతున్నాయి. ఓ పెయింట్స్ కంపెనీలో(, Paint company) ఒక్కసారిగా మంటలు చెలరేగడంతో స్థానిక ప్రజలు ఉలిక్కిపడ్డారు. ఈ అగ్నిప్రమాదంలో ఓ మహిళకు తీవ్ర గాయాలు కాగా స్థానికులు హాస్పిటల్కు తరలించారు.
సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది సంఘటన స్థలానికి చేరుకొని మంటలను ఆర్పే ప్రయత్నం చేశారు. కాగా, పెయింట్స్ కంపెనీ జనవాసాల మధ్య ఉండటంతో ప్రజలు భయాందోళనలకు గురయ్యారు. పోలీసులు కంపెనీ పరిసర ప్రజలను అక్కడ నుంచి తరలించారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.