ప్రముఖ తమిళ హాస్యనటుడు వివేక్ ఈ రోజు తెల్లవారుఝామున గుండెపోటుతో తుదిశ్వాస విడిచిన విషయం తెలిసిందే. ఆయన మృతి తెలుగు, తమిళ సినీ పరిశ్రమను దిగ్భ్రాంతికి గురి చేసింది. వివేక్ నటుడిగానే కాకుండా ప్రకృతి ప్రియుడిగాను అందరి మనసులు గెలుచుకున్నాడు. సామాజిక సేవలోను ఎల్లప్పుడు ముందుంటారు. వృక్షాల నరికివేతకు వ్యతిరేకంగా, పర్యావరణ సంరక్షణకు మద్దతుగా ఆయన పలు ప్రచార కార్యక్రమాలు నిర్వహించారు.59 సంవత్సరాల ఈ ‘పద్మశ్రీ’ అవార్డు గ్రహీత మృతికి పలువురు ప్రముఖులు సంతాపం తెలియజేస్తున్నారు.
తాజాగా ఎంపీ సంతోష్ కుమార్ తన ట్విట్టర్ ద్వారా సంతాపం తెలియజేశారు. వివేక్ హఠాన్మరణం నన్ను షాక్కు గురి చేసింది. ప్రముఖ తమిళ నటుడు, ప్రకృతి ప్రియుడు అయిన వివేక్ గ్రీన్ కలం ప్రాజెక్ట్ కింద 32 లక్షలు మొక్కలు నాటారు. ప్రకతిపై మీకున్న ప్రేమ చరిత్రలో ఎప్పటికీ నిలిచిపోతుందని తన ట్వీట్లో పేర్కొన్నారు. వివేక్ ప్రభుత్వ, ప్రైవేటు సంస్థలు నిర్వహించే అవగాహనా కార్యక్రమాలకు తన వంతు సాయం అందిస్తుంటారు. అగ్ర హీరోలైన రజనీ, కమల్, సూర్య, విక్రమ్, విజయ్, అజిత్ తదితర హీరోల చిత్రాల్లో నటించారు.
Saddened to know about the untimely demise of Thiru @Actor_Vivek garu, Well known Tamil #Comedian and ardent #NatureLover who planted nearly 32 lakhs saplings till now under #GreenKalam Project. Your love towards nature will be remembered forever sir. 🙏💐#GreenIndiaChallenge🌱 pic.twitter.com/KC8nTcEMss
— Santosh Kumar J (@MPsantoshtrs) April 17, 2021