తమిళ స్టార్ హీరో సూర్యకు ద్విపాత్రాభినయం కొత్తేమి కాదు. ఇప్పటికే ఆయన పలు చిత్రాల్లో డ్యూయల్ రోల్స్‌లో మెప్పించారు. తాజాగా ఆయన మరోమారు ద్విపాత్రాభినయంలో కనిపించబోతున్నారని తెలిసింది. వివరాల్లోకి వెళితే.. సూర్య కథానాయకుడిగా వెంకీ అట్లూరి దర్శకత్వంలో సితార ఎంటర్టైన్మెంట్స్ సంస్థ భారీ పాన్ ఇండియా చిత్రాన్ని నిర్మిస్తున్న విషయం తెలిసిందే. ఇటీవల లాంఛనంగా ప్రారంభోత్సవం జరుపుకుంది. ఈ సినిమా అప్డేట్స్ కోసం సూర్య అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. తాజా సమాచారం ప్రకారం ఈ సినిమాలో సూర్య డ్యూయల్ రోల్లో కనిపిస్తారట. ఈ రెండు పాత్రలు భిన్న కోణాల్లో సాగుతాయని, ఓ క్యారెక్టర్ నెగెటివ్‌గా ఉంటుందని చెబుతున్నారు. రాబరీ నేపథ్యంలో యాక్షన్ థ్రిల్లర్‌గా ఈ చిత్రాన్ని తెరకెక్కించబోతున్నారని సమాచారం.