అమరావతి : ఏపీ డిప్యూటీ సీఎం, జనసేన అధినేత పవన్‌కల్యాణ్ (Pawan Kalyan) తో సినీ నిర్మాతలు సోమవారం భేటీ కానున్నారు. విజయవాడలోని మంత్రి క్యాంపు కార్యాలయంలో మధ్యాహ్నం ఈ భేటీ జరుగనుంది. సినీ నిర్మాతలు (Movie producers ) అశ్వినీదత్, చినబాబు, నవీన్, రవిశంకర్, నాగవంశీ, విశ్వప్రసాద్, బోగవల్లి ప్రసాద్, డివివి.దానయ్య, ఫిల్మ్ ఛాంబర్ అధ్యక్షుడు దిల్‌రాజు, దామోదరప్రసాద్ తదితరులు కలువనున్నారు.
చిత్రపరిశ్రమ ఎదుర్కొంటున్న పలు సమస్యలను పవన్‌కల్యాణ్ దృష్టికి తీసుకురానున్నారు. సినిమా టికెట్ల ధరల పెంపు వెసులుబాటు, థియేటర్ల సమస్యల వాటిపై చర్చించే అవకాశముంది. చిత్ర పరిశ్రమకు చెందిన పవన్‌కల్యాణ్ నటుడిగా ఎదిగి రాజకీయ రంగ ప్రవేశం చేసి , డిప్యూటీ సీఎం(Deputy CM) స్థాయికి ఎదిగినందుకు గాను అభినందనలు తెలియజేయడానికి కూడా నిర్మాతలు మొదటిసారి పవన్‌ను కలువనున్నారు.
వైసీపీ ప్రభుత్వ హయాంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్(YS Jagan) ను నేరుగా నటుడు చిరంజీవి ఆధ్వర్యంలో నాగార్జున, మహేశ్‌బాబు, ప్రభాస్, నిర్మాతలు దిల్‌రాజ్ కలిసి సమస్యలను విన్నవించారు. అప్పటి మంత్రుల వ్యవహారశైలీతో ప్రముఖ నటులు తమ చిత్రాల విడుదల సమయంలో అనేక ఇబ్బందులను ఎదుర్కొన్నారు. అనుకూలమైన వ్యక్తులకు ఆంక్షల సడలింపు, వ్యతిరేకంగా కనిపించిన వారికి ఆంక్షలు విధించి విమర్శల పాలయ్యారు.