తెగించి తీసుకున్న నిర్ణయమిది
అస్తిత్వం, ఆత్మాభిమానం విషయాల్లో సమంత అస్సలు రాజీపడరు. ‘విజయాన్ని సాధించాల్సింది వ్యక్తి మాత్రమే. ఆ వ్యక్తి ఆడా, మగా అనేది వ్యవస్థలో అనవసరం.
అస్తిత్వం, ఆత్మాభిమానం విషయాల్లో సమంత అస్సలు రాజీపడరు. ‘విజయాన్ని సాధించాల్సింది వ్యక్తి మాత్రమే. ఆ వ్యక్తి ఆడా, మగా అనేది వ్యవస్థలో అనవసరం. అసలు ఆ ఆలోచనే అర్థరహితం’ అంటారు సమంత. ఆమె తాజా చిత్రం ‘మాఇంటి బంగారం’ రూ.100 కోట్ల వసూళ్లు దాటింది. టాలీవుడ్లో ఈ క్రెడిట్ సాధించిన తొలి మహిళాప్రధాన చిత్రమిదేనని ఇండస్ట్రీ వర్గాలు చెబుతున్నాయి. ఈ సందర్భంగా ఈ సినిమా విడుదలకు ముందు జరిగిన ఓ సంఘటనను సామ్ తన ఇన్స్టా ద్వారా పంచుకున్నారు. “మాఇంటి బంగారం’ విడుదలకు ముందు అసలు ఈ సినిమా గురించి ఎవరైనా మాట్లాడుకుంటారా? మా ప్రయత్నం ప్రేక్షకులకు చేరుతుందా? అని ఆలోచించాం.
ఇందులో భాగంగా ఓ ఎగ్జిబిటర్కి నా స్నేహితుడు ఫోన్ చేసి ‘ ‘మాఇంటి బంగారం’ గురించి జనాల్లో ఆసక్తి ఉందా? అసలు డబ్బులు వస్తాయంటారా?’ అనడిగాడు. ‘ఆ.. హీరోయిన్ సినిమాలను ఎవరు చూస్తారండీ.. ఎవరైనా పెద్ద హీరో పక్కన నటిస్తే ఓకే. ఎందుకంటే ఆమె అందంగా ఉంటుంది.. అందరికీ తెలుసు. కానీ ఆమే అంతా అంటే ఎవరొస్తారు చెప్పండి!?’ అంటూ నిర్లక్ష్యంగా మాట్లాడాడు ఆ ఎగ్జిబిటర్. ఆ మాటలు నేను వింటున్నట్టు అతనికి తెలీదు. నిజానికి ఈ అభిప్రాయం అతనిది మాత్రమే కాదు. చాలామందిలో ఇదే అభిప్రాయం ఉంది. మార్పు రావాలంటే తెగించి, ధైర్యంగా నిర్ణయం తీసుకోవాలి. నేను తీసుకున్నాను.. సఫలీకృతమయ్యాను. ఇది ఓ గొప్ప మార్పుకు నాంది అవుతుందని భావిస్తున్నా. ఇకనుంచి మహిళా ప్రధాన చిత్రాలను ఎవరూ తక్కువచేసి మాట్లాడకూడదు. మాట్లాడరని ఆశిస్తున్నా’ అంటూ ఆ పోస్ట్లో పేర్కొన్నారు సమంత.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
priest predicted son, shot dead | కొడుకు పుడతాడని జోస్యం చెప్పిన పూజారి.. కుమార్తె జన్మించడంతో ఆయనపై కాల్పులు జరిపి హత్య
Fauzi | దర్శకుడికి గాయం.. ప్రభాస్ ‘ఫౌజీ’ షూటింగ్కు చిన్న బ్రేక్
Tragedy | పండుగ పూట విషాదం.. రోడ్డు ప్రమాదంలో అన్న, చెల్లి దుర్మరణం
Sunitha Lakshma Reddy | తెలంగాణ సంస్కృతికి ప్రతీక బతుకమ్మ పండుగ: మాజీ మంత్రి సునీత లక్ష్మారెడ్డి
Chirumarthi Lingaiah | నిరుద్యోగులను మోసం చేసిన కాంగ్రెస్కు బుద్ది చెప్పాలి : మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య
ట్రెండింగ్ వార్తలు
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!

