‘భీమ్లానాయక్’ చిత్రం ద్వారా గుర్తింపు సంపాదించుకున్న మోనిక రెడ్డి ప్రధాన పాత్రలో సుధా క్రియేషన్స్ సంస్థ నిర్మిస్తున్న తాజా చిత్రం ఇటీవల హైదరాబాద్‌లో ప్రారంభమైంది. రాకేష్ రెడ్డి దర్శకుడిగా పరిచయమవుతున్నాడు. ముహూర్తపు సన్నివేశానికి దేవిప్రసాద్ బలివాడ క్లాప్‌నివ్వగా, అంజిరెడ్డి కెమెరా స్విఛాన్ చేశారు.
దర్శకుడు మాట్లాడుతూ ‘పీరియాడిక్ మైథలాజికల్ ఫిల్మ్ ఇది. ఓ మహిళ రాజ్యం కోసం చేసే పోరాటమే చిత్ర ఇతివృత్తం’ అన్నారు. లేడీ ఓరియెంటెడ్ చిత్రంలో నటించడం ఆనందంగా ఉందని మోనికా రెడ్డి పేర్కొంది. రెగ్యులర్ షూటింగ్ మొదలైందని, త్వరలో టైటిల్‌ను ప్రకటిస్తామని చిత్రబృందం తెలిపింది.