Vishwambhara Most Trolled Telugu Movie | ఇండియాలో ప్రస్తుతం వైరల్ అవుతున్న ఒకే ఒక పదం గ్రోక్(Grok). మారుతున్న కాలానికి పోటిపడే విధంగా ప్రస్తుతం కృత్రిమ మేధస్సులు (Artificial Intelligence) వస్తున్న విషయం తెలిసిందే. ఇప్పటికే కృత్రిమ మేధస్సు ద్వారా చాట్‌జీపిటీ, డీప్ సీక్ తమ సేవలను అందిస్తున్నాయి. అయితే ఈ రెండింటికి పోటీగా స్పేస్ ఎక్స్ అధినేత ఎలాన్ మస్క్ తీసుకువచ్చిందే గ్రోక్ (Grok AI). ఎక్స్ వేదికగా గ్రోక్ అనే ఆర్టిఫిషియల్ ఇంటలిజెన్స్(Artificial Intelligence)ను పరిచయం చేయగా.. దీనిని విపరీతంగా వాడేస్తున్నారు నెటిజన్లు.. చాట్‌జీపీటీ(Chatgpt) లాగా సున్నితమైన భాషను మాట్లాడకుండా గ్రోక్ తనకు నచ్చిన భాషలో ఇచ్చిపడేస్తుంది. రీసెంట్గా తెలుగు ఫ్యాన్వార్ గ్రూప్‌లను ఒక ఆటాడుకుంది ఈ గ్రోక్. అంతేగాకుండా బీజేపీ చేస్తున్న ఫేక్ ప్రోపగండా వార్తలను కూడా ఎక్స్పోజ్ చేసింది. అయితే మనకు ఏ విషయంలో సందేహము ఉన్న నిర్మోహమాటంగా అడిగేయమంటుంది గ్రోక్.
ఇందులో భాగంగానే ఒక తెలుగు నెటిజన్ ఎక్స్‌లో అత్యధికంగా ట్రోల్ అయినా టాలీవుడ్ మూవీ ఏంటి అని అడుగగా.. దీనికి చిరంజీవి విశ్వంభర(Vishwambhara) సినిమా అని టక్కున సమాధానం చెప్పింది గ్రోక్. క్వాలిటీ లేని VFX, కాపీ చేసిన సీన్ల వలన విశ్వంభర టీజర్ విపరీతంగా ట్రోల్ అయిన విషయం తెలిసిందే. దీంతో ఈ సినిమాను విడుదలను వాయిదా వేశారు మేకర్స్. దీంతో విశ్వంభర చిత్రం ఎక్స్‌లో ఇప్పటివరకు అత్యధికంగా ట్రోలింగ్కి గురైన చిత్రంగా నిలిచినట్లు గ్రోక్ పేర్కోంది. దీని తర్వాత వరుణ్ తేజ్ హీరోగా వచ్చిన ఆపరేషన్ వాలెంటైన్(Operation Valentine), విజయ్ దేవరకొండ ఫ్యామిలీ స్టార్ (Family Star), పూరీ జగన్నాథ్ డబుల్ ఇస్మార్ట్(Double Ismart), రవితేజ – హారీశ్ శంకర్ మిస్టర్ బచ్చన్(Mr Bachchan), రామ్ స్కంద, లైగర్ చిత్రాలు కూడా ట్రోల్ జాబితాలో ఉన్నట్లు తెలిపింది.
Vishwambhara (2025) likely tops the list of most trolled Telugu movies on X till today, hit hard by criticism over poor VFX and copied shots. Other 2024 flops like Operation Valentine, Family Star, Double iSmart, and Mr. Bachchan also faced heavy trolling due to poor box office…
— Grok (@grok) March 17, 2025