Most eligible bachelor | అఖిల్ అక్కినేని, పూజా హెగ్డే జంటగా వస్తున్న రొమాంటిక్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌లర్. మెగా ప్రొడ్యూసర్ అల్లు అరవింద్ సమర్పణలో బొమ్మరిల్లు భాస్కర్ ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. భలే భలే మగాడివోయ్, పిల్లా నువ్వులేని జీవితం, గీత గోవిందం, ప్రతిరోజు పండగే లాంటి బ్లాక్‌బస్టర్ సినిమాలతో మోస్ట్ సక్సెస్ ఫుల్ నిర్మాతగా క్రేజ్ సొంతం చేసుకున్న బన్నీ వాసు, మరో నిర్మాత ప్రముఖ దర్శకుడు వాసు వర్మతో కలిసి సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన ఈ సినిమా టీజర్, పాటలకు అద్భుతమైన రెస్పాన్స్ వస్తోంది. తాజాగా మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌లర్ చిత్రం నుంచి లెహరాయి ( Leharaayi ) లిరికల్ సాంగ్ అప్డేట్ వచ్చింది. సెప్టెంబర్ 15న ఈ రొమాంటిక్ సాంగ్ విడుదల కానుంది. ఈ మేరకు అఖిల్, పూజ హెగ్డే రొమాంటిక్ పోస్టర్ విడుదల చేశారు మేకర్స్. మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ ఆడియో ఆదిత్య మ్యూజిక్ ద్వారా మార్కెట్లోకి విడుదల కానుంది.
Bringing to you the most romantic and breezy melody #Leharaayi from #MostEligibleBachelor ❤️🔥
— GA2 Pictures (@GA2Official) September 11, 2021
Full song out on September 15th! 🎧#AlluAravind @AkhilAkkineni8 @hegdepooja @baskifilmz @GopiSundarOffl #PradeeshMVarma #BunnyVas #VasuVarma @adityamusic #MEBOnOct8th pic.twitter.com/vihP3mDern
ఈ సినిమాను అక్టోబర్ 8న విడుదల చేయనున్నట్లు ప్రకటించారు యూనిట్. తన చిత్రాల్లోని పాత్రల్ని చాలా క్యూట్ రొమాన్స్‌తో లవ్ లీగా వుండేలా డిజైన్ చేస్తారు దర్శకుడు భాస్కర్. ఇప్పుడు మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌లర్ సినిమాలో కూడా అన్ని పాత్రలను అలాగే డిజైన్ చేస్తున్నారు. ఇప్పుడు విడుదలైన పోస్టర్ కూడా చాలా అందంగా ఉంది. అఖిల్ ఈ సినిమాతో ఎలాగైనా హిట్ కొడతానని ధీమాగా ఉన్నాడు. గీతా ఆర్ట్స్ నుంచి వస్తున్న సినిమా కావడంతో అభిమానులు కూడా భారీ అంచనాలే పెట్టుకున్నారు. ఇన్ని ఫ్లాపుల తర్వాత బొమ్మరిల్లు భాస్కర్‌కు అవకాశం ఇచ్చారంటే.. కచ్చితంగా అద్భుతమైన కథే చెప్పుంటాడని నమ్ముతున్నారు అక్కినేని ఫ్యాన్స్. అక్టోబర్ 8న అఖిల్ నమ్మకం నిజం అవుతుందో లేదో తెలుస్తుంది.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
Saidharam Tej | స్పృహలోకి వచ్చిన సాయిధరమ్ తేజ్
sai dharam tej : నా ఇంటి నుంచి వెళ్తుండగానే యాక్సిడెంట్ జరిగింది : నరేశ్
Prabhas | ప్రభాస్‌తో గొడవపడిన స్టార్ హీరోయిన్ ఎవరో తెలుసా..?
Sai Dharam Tej: సాయి తేజ్ బైక్‌పై చలానా.. ఎందుకు వేసారో తెలుసా?