పాన్ ఇండియా ట్రెండ్ విషయంలో మహేష్ అభిప్రాయం వేరు. మన సినిమా జాతీయంగా పేరు తెచ్చుకోవడం ఆయనకూ సంతోషమే. అయితే ‘ప్రత్యేకంగా పాన్ ఇండియా మూవీస్ చేయాల్సిన పనిలేదు. తెలుగులో చేసిన సినిమానే పాన్ ఇండియాగా రిలీజ్ చేస్తే చాలు’ అనేది మహేష్ చెప్పే మాట. ఆ మధ్య ‘సర్కారు వారి పాట’ సినిమా ప్రచారంలో ..‘నన్ను బాలీవుడ్ భరించలేదు’ అని మహేష్ చెప్పినట్లు ప్రచారమైన కొన్ని వ్యాఖ్యలు వివాదాస్పదం అయ్యాయి.
అయితే తన మాటల్ని వక్రీకరించారని స్పష్టత ఇచ్చారీ స్టార్ హీరో. ఏమైనా తోటి హీరోలంతా పాన్ ఇండియా మూవీస్ ప్లాన్ చేస్తుండటం, అవి విజయాలు సాధించి పేరు తెచ్చుకోవడంతో మహేష్ మీదా ఆ ఒత్తిడి పరోక్షంగా పడుతున్నట్లే. ఈ ప్రభావం మహేష్ త్రివిక్రమ్ కాంబో సినిమా మీద ఉంటుందా అనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఇప్పుడున్న ట్రెండ్‌కు ఈ సినిమాను పాన్ ఇండియా మూవీగా విడుదల చేస్తేనే బాగుంటుందని అనుకుంటున్నారట. మిగతా హీరోల్లా..సరే మనమూ ప్రయత్నిద్దాం అని మహేష్ అనుకుంటే..తెలుగు నుంచి మరో భారీ పాన్ ఇండియా మూవీ వచ్చినట్లే.