Monalisa| ఇటీవల జరిగిన మహా కుంభమేళాలో పూసల దండలు అమ్ముతూ యూట్యూబర్స్ దృష్టిలో పడి ఓవర్ నైట్ సెలబ్రిటీగా మారింది మోనాలిసా భోంస్లే. మధ్యప్రదేశ్ లోని ఇండోర్‌కి చెందిన ఆమెని యూట్యూబర్ ఫొటోలు, వీడియోలు తీసి సెలబ్రిటీని చేసేశారు. ఆమె ఫొటోలు, నెట్టింట వైరల్ కావడంతో మోనాలిసా పేరు దేశ వ్యాప్తంగా మార్మోగింది. ఇంకేముంది ఆమెతో సినిమాలు చేసేందుకు మేకర్స్ క్యూ కట్టారు. పనిలో పని ఒక వ్యక్తి తాను దర్శకుడిని అని చెప్పి అగ్రిమెంట్ కూడా కుదుర్చుకున్నాడు. అయితే అతను మోసగాడని, సినిమా అవకాశాల పేరుతో మోనాలిసాను ట్రాప్ చేస్తున్నారని అతనిపై ఆరోపణలు రావడం, పోలీస్ కేసు నమోదు కావడం కూడా జరిగింది.
ఈ క్రమంలో మోనాలిసా మొదటి సినిమా ఏమైందో తెలియదు. అయితే ఈ అమ్మడు పలు షాప్ ఓపెనింగ్స్, స్పెషల్ సాంగ్స్, యాడ్స్ చేస్తూ బిజీ బిజీగా మారింది.తాజాగా ఓ స్పెషల్ సాంగ్‌లో నటుడు ఉత్కర్ష్ సింగ్‌తో కలిసి నటిస్తుంది. ముంబైలో యాక్టింగ్ క్లాసెస్ ద్వారా నైపుణ్యం సంపాదించిన మోనాలిసా ఈ స్పెషల్ సాంగ్‌తో అలరించాలని అనుకుంటుంది. ఇప్పటికే కొంత షూటింగ్ పూర్తి కాగా, మొత్తం పూర్తయ్యాక యూట్యూబ్‌లో విడుదల చేయనున్నట్టు తెలుస్తుంది. ఈ పాటలో మోనాలిసా అందం, ఎక్స్ప్రెషన్స్ స్పెషల్ అట్రాక్షన్ కానున్నాయి. ఆమె నటనని ఎప్పుడెప్పుడు చూస్తామా అన్న వారికి ఇది పండగలాంటి వార్తే.
ఈ మధ్య మోనాలిసా బయట ఎప్పుడు కనిపించినా మేకప్ తోనే కనిపిస్తోంది. దీంతో కొన్ని సార్లు బాగా ట్రోలింగ్ కు కూడా గురువుతోంది. అదే సమయంలో సినిమా పేరుతో మోనాలిసాను మభ్య పెడుతున్నారని ఆమెను ఛీట్ చేస్తున్నారని కూడా కొందరు నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు. ఈ అమ్మడు తేనెకళ్లు, డస్కీ స్కిన్, స్వచ్ఛమైన చిరునవ్వుతో యూత్‌ను మత్తెక్కిస్తోంది.
Mona