కుంభమేళాలో పూసలు, రుద్రాక్షలు అమ్ముతూ చక్కటి అందంతో మీడియా దృష్టిని ఆకర్షించిన మోనాలిసా తెలుగులో ‘లైఫ్’ అనే చిత్రం ద్వారా కథానాయికగా ఎంట్రీ ఇస్తున్నది. వెంగమాంబ క్రియేషన్స్ నిర్మిస్తున్న ఈ చిత్రంలో సాయిచరణ్ కథానాయకుడిగా నటిస్తున్నారు. శ్రీను కోటపాటి దర్శకుడు.
బుధవారం హైదరాబాద్లో ఈ సినిమా ప్రారంభమైంది. కుంభమేళా ఫేమ్ మోనాలిసాతో సినిమా చేస్తే క్రేజ్ వస్తుందని భావించామని, మంచి కథ కుదిరిందని చిత్ర నిర్మాత అంజయ్య విరిగినేని అన్నారు. నేటి తరానికి కనెక్ట్ అయ్యే ఈ కథలో మంచి సందేశం కూడా ఉంటుందని దర్శకుడు తెలిపారు. హైదరాబాద్కు రావడం చాలా ఆనందంగా ఉందని, త్వరలో తెలుగు నేర్చుకుంటానని మోనాలిసా తెలిపింది. ఈ చిత్రానికి కెమెరా: మురళీమోహన్ రెడ్డి, సంగీతం: సుకుమార్, కథ, స్క్రీన్ప్లే, దర్శకత్వం: కోటపాటి శ్రీను.