Vishnu Vishal | తెలుగు, తమిళ ప్రేక్షకులకు పెద్దగా ఇంట్రడక్షన్ అవసరం లేని యాక్టర్ విష్ణు విశాల్. ఈ మల్టీ టాలెంటెడ్ యాక్టర్ నటించిన టైటిల్ రోల్లో నటించిన చిత్రం ఆర్యన్. ఇటీవలే ప్రేక్షకుల ముందుకొచ్చిన ఈ మూవీ మంచి టాక్ తెచ్చుకుంది. విష్ణు విశాల్ నిర్మాత అని కూడా తెలిసిందే. తప్పకుండా రెమ్యునరేషన్ తగ్గించుకోవాలని తన కోస్టార్లు, ఆర్టిస్టులకు సూచిస్తున్నాడు విష్ణు విశాల్.
నిర్మాతగా వరుసగా మూడు హిట్స్ అందుకున్న మీరు బాక్సాఫీస్ వద్ద సినిమాల మార్కెట్ చేసుకోవడంలో ఇబ్బందులు పడుతున్న ఇతర నిర్మాతలకు మీరు ఏం సలహా ఇస్తారని ఆర్యన్ సక్సెస్ మీట్లో విష్ణువిశాల్ను ఓ రిపోర్టర్ ప్రశ్నించాడు. దీనికి సమాధానంగా విష్ణు విశాల్ మాట్లాడుతూ.. నేను నిర్మాతలకు ఎలాంటి సలహా ఇవ్వను. ఇక్కడున్న హీరోలు, ఆర్టిస్టులు దయచేసి మీ రెమ్యునరేషన్ తగ్గించుకోవాలని మాత్రమే చెబుతా. అప్పుడే మనం ఆ డబ్బును సినిమా మేకింగ్‌లో ఖర్చు పెట్టడం కోసం వినియోగించుకుంటామని.. నేను అందరికీ ఇదే చెప్పదలచుకున్నానన్నాడు విష్ణు విశాల్.
ఇప్పటికే ఇలాంటి కామెంట్స్‌ను పలువురు దర్శకులు, నిర్మాతలు చేశారని ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. ఏదేమైనప్పటికీ విష్ణు విశాల్ కామెంట్స్ స్వాగతించాల్సిందేనని పలువురు మూవీ లవర్స్ అభిప్రాయపడుతున్నారు. ఈ కామెంట్స్‌కు దర్శకనిర్మాత ఎస్పీ శక్తివేల్ స్వాగతిస్తూ.. మొత్తానికి మార్పు రావాల్సిన అవసరముందని ట్వీట్ చేశాడు.
Producer #VishnuVishal‘s suggestions to Actors👌
“If they reduce the remuneration, so that we can spend more for making of the film👏”pic.twitter.com/BYcS2o2mUW— AmuthaBharathi (@CinemaWithAB) November 4, 2025
Dies Irae | మోహన్‌లాల్ కొడుకు కొత్త మూవీ.. ‘డీయాస్ ఈరే’ తెలుగు ట్రైలర్ రిలీజ్
Peddi First Single | ‘పెద్ది’ అప్డేట్ వచ్చేసింది.. ‘చికిరి’ వీడియో పంచుకున్న టీమ్
Mira Nair Son | న్యూయార్క్ మేయర్‌గా భారతీయ దర్శకురాలి కొడుకు.. ఎవరీ జోహ్రాన్ మమ్దానీ?