బిగ్ బాస్ సీజన్ 4తో తెలుగు ఆడియెన్స్ కు చాలా దగ్గరైంది గుజరాతీ భామ మోనాల్ గజ్జర్
( Monal Gajjar )…అప్పటిదాకా పలు సినిమాల్లో నటించినా బిగ్ బాస్ తో ఈ బ్యూటీకి క్రేజ్ మాత్రం అమాంతం పెరిగిపోయింది. మోనాల్ గజ్జర్ అల్లుడు అదుర్స్ చిత్రంలో సోనూసూద్, బెల్లంకొండ శ్రీనివాస్ తో కలిసి స్పెషల్ సాంగ్ లో స్టెప్పులేసిన సంగతి తెలిసిందే. అయితే ఈ సుందరి మరోసారి ఐటెం సాంగ్ లో మెరువనుందన్న వార్త హాట్ టాపిక్ గా మారింది. మోనాల్ గజ్జర్ ఖాతాలో భారీ ఆఫర్ వచ్చి పడ్డట్టు టాలీవుడ్ సర్కిల్ టాక్.
అక్కినేని నాగార్జున, కల్యాన్ కృష్ణ కాంబోలో వస్తున్న క్రేజీ ప్రాజెక్టు బంగార్రాజు (Bangaraju). త్వరలోనే సెట్స్ పైకి వెళ్లనుంది. ఈ చిత్రంలో మోనాల్ గజ్జర్ స్పెషల్ నంబర్ లో మెరువనుందని ఇన్ సైడ్ టాక్. ఒకవేళ ఈ ఆఫర్ నిజమైతే మోనాల్ కెరీర్‌కు చాలా హెల్ప్ అయ్యే అవకాశం ఉంటుందని అంతా అనుకుంటున్నారు. సోగ్గాడే చిన్ని నాయనా చిత్రంలో అనసూయ స్పెషల్ సాంగ్ లో కనిపించగా అద్బుతమైన స్పందన వచ్చింది. మరి మోనాల్ కు బంగార్రాజు చిత్రం ఎంత వరకు సాయపడుతుందో చూడాలి.
మోనాల్ గజ్జర్ ప్రస్తుతం బిగ్ బాస్ హౌస్‌మేట్ అఖిల్ సార్థక్ తో ఓ వెబ్ సిరీస్ లో నటిస్తోంది. అంతేకాకుండా స్టార్ మాలో డ్యాన్స్ షో హోస్టింగ్ లో బిజీగా ఉంది.
ఇవి కూడా చదవండి..
Karan Johar Fear| భయపడుతున్న బాలీవుడ్ దర్శకుడు
Sukumar | తండ్రి పేరు మీద స్కూల్ ప్రారంభించిన సుకుమార్
దోస్తి వీడియో సాంగ్ ఐడియా ఎవరిదో చెప్పిన రాజమౌళి
Vedhika Kumar look | వేదిక స్టన్నింగ్ లుక్కు నెటిజన్లు ఫిదా….వీడియో