Mokshagna Teja Prasanth Varma Movie | టాలీవుడ్ అగ్ర నటుడు నందమూరి బాలకృష్ణ తనయుడు మోక్షజ్ఞ వెండితెరపైకి ఎంట్రీ ఇవ్వబోతున్నట్లు ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే మోక్షజ్ఞ మొదటి సినిమాకు దర్శకత్వం వహించేది హన్మాన్ దర్శకుడు ప్రశాంత్ వర్మ అని ఇప్పటికే ప్రకటించారు. ఇక ప్రశాంత్ సినిమాటిక్ యూనివర్స్‌లో భాగంగా ఈ సినిమా రాబోతుండగా.. డిసెంబర్ 5న ఈ ప్రాజెక్ట్ ప్రారంభం కానుందని ప్రకటించిన విషయం తెలిసిందే. దీంతో నందమూరి అభిమానులు ఆరోజు ఎప్పుడు వస్తుందా అని ఆతృతగా ఎదురుచూస్తున్నారు. మరోవైపు దర్శకుడు ప్రశాంత్ వర్మ కూడా సింబా ఇస్ కమింగ్ అంటూ అభిమానుల్లో ఆశలను రేపాడు. అయితే ఈ తాజాగా ఈ ప్రాజెక్ట్ వాయిదా పడింది.
ప్రశాంత్ వర్మ మోక్షజ్ఞ సినిమా ఆగిపోయిందంటూ సోషల్ మీడియాలో ప్రచారం మొదలైంది. దీంతో అది నిజమేనేమో అనే కంగారు ఫ్యాన్స్‌లోనూ మొదలైంది. అయితే దీనిపై తాజాగా బాలయ్య క్లారిటీ ఇచ్చాడు. రీసెంట్గా ఒక ఈవెంట్‌కి వచ్చిన బాలకృష్ణ మోక్షజ్ఞ సినిమా ఓపెనింగ్ గురించి మాట్లాడుతూ.. ఓపెనింగ్ ఎందుకు వాయిదా పడిందో చెప్పుకొచ్చారు. మోక్షజ్ఞకి ప్రస్తుతం ఆరోగ్యం బాలేదని అందుకే ఓపెనింగ్ పోస్ట్ పోన్ చేసినట్లు వెల్లడించారు. మరో మంచి ముహూర్తం చూసుకుని సినిమా ఓపెనింగ్ చేద్దాం అంటూ బాలయ్య చెప్పుకోచ్చారు.