Mohanlal visits Sabarimala Ayyappa temple | భారతదేశంలోని ప్రముఖ పుణ్యక్షేత్రాల్లో ఒకటైన కేరళలోని శబరిమల అయ్యప్ప స్వామిని మలయాళ స్టార్ నటుడు మోహన్ లాల్ దర్శించుకున్నాడు. మాల ధరించిన లల్లెట్టన్ ఇరుముడి కట్టుకుని కాలినడకలో అయ్యప్ప దర్శనంకి వచ్చాడు. ఆలయంకి చేరుకున్న మోహన్‌లాల్ 18 మెట్లు ఎక్కి ఆ మణికంఠుడిని దర్శించుకున్నాడు. ఇక మోహన్ లాల్ రాకతో ఆలయ అధికారులు అతడికి ఘనస్వాగతం పలికారు. అనంతరం ప్రత్యేక పూజలు నిర్వహించి తీర్థ ప్రసాదాలు అందజేశారు. కాగా ఇందుకు సంబంధించిన ఫొటోలు, వీడియోలు ప్రస్తుతం వైరల్‌గా మారాయి.
మోహన్ లాల్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న తాజా చిత్రం ఎల్2 ఎంపురాన్(L2 Empuraan). మలయాళంలో 2019లో విడుదలై సూపర్ హిట్ అందుకున్న (Lucifer) సినిమాకి ఈ చిత్రం సీక్వెల్‌గా వస్తుంది. నటుడు పృథ్వీరాజ్ సుకుమారన్ (Prithviraj Sukumaran) ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తుండగా.. మంజు వారియర్ (Manju Warrier), టోవినో థామస్(Tovino Thomas) కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఈ సినిమా మార్చి 27న ప్రేక్షకుల ముందుకు రానుంది. అయితే ఈ సినిమా హిట్టు అవ్వాలని కోరుకుంటూ మెహన్ లాల్ అయ్యప్ప దర్శనం చేసుకున్నట్లు తెలుస్తుంది.
சபரிமலைக்கு திடீர் விசிட் அடித்த நடிகர் மோகன்லால்; நடிகர் மம்முட்டி பெயரில் சிறப்பு பூஜை! #Mohanlal #Mammootty #Sabarimala #Kerala pic.twitter.com/2YMtwZYgrj
— Idam valam (@Idam_valam) March 19, 2025