లెజెండ్ స్టార్ హీరోలంతా తమ తమ సినిమాలతో బిజీ అయిపోయారు. వీరిలో ఎక్కువ మంది హైదరాబాద్ లో షూటింగ్ చేస్తున్నారు. ప్రస్తుతం బిజీగా ఉన్న స్టార్ హీరోల్లో టాలీవుడ్ హీరో పవన్ కల్యాణ్ (Pawan Kalyan), మలయాళ హీరో మోహన్ లాల్ (Mohanlal) ఒకరు. పవన్ కల్యాణ్ ప్రస్తుతం భీమ్లా నాయక్ (Bheemla Nayak) చిత్రీకరణలో ఉన్నాడు. తన అప్ కమింగ్ మూవీస్ కోసం మోహన్ లాల్ హైదరాబాద్ లోనే ఉన్నాడు. ఇక ఈ ఇద్దరు స్టార్ హీరోలు ఒక్క చోట చేరి సందడి చేశారు.
ఇటీవలే హైదరాబాద్‌లోని అల్యూమినియం ఫ్యాక్టరీలో పవన్, మోహన్ లాల్ ఒకేసారి సినిమా షూటింగ్స్ లో పాల్గొన్నారు. విరామ సమయంలో లొకేషన్ లో ఈ ఇద్దరు స్టార్ యాక్టర్లు ఒక్క చోట చేరిపోయారు. సినిమాలు, రాజకీయాల గురించి చర్చించారు. అంతేకాదు ఈ స్టార్ హీరోలిద్దరికీ నిర్మాతలు స్పెషల్ డిన్నర్ ఏర్పాటు చేశారట. సాధారణంగా ఇలాంటి సమావేశాలు జరిగినపుడు ఏదో ఒక స్టిల్ బయటకు వస్తుంది. మోహన్ లాల్, పవన్ విషయంలో మాత్రం ఇద్దరి పీఆర్ టీం కానీ, మేకర్స్ కానీ దీని గురించి ఎలాంటి కామెంట్స్ చేయలేదు.
సింపుల్ గానే ఈ సమావేశం జరుపాలనుకున్న ఇద్దరు యాక్టర్లు ఎలాంటి పబ్లిసిటీ చేయొద్దని వారి టీం మెంబర్స్ కు చెప్పినట్టు టాలీవుడ్ సర్కిల్ టాక్. తన ఇండస్ట్రీ స్నేహితుడైన మోహన్ బాబును కలిసిన మోహన్ లాల్ కేరళకు పయనమయ్యేముందు మెగాస్టార్ చిరంజీవిని కూడా కలువబోతున్నాడట.
ఇవికూడా చదవండి..
Bandla Ganesh | ఇంట్రెస్టింగ్ అప్డేట్..హీరోగా బండ్లగణేశ్..!
Raashi Khanna | రాశీఖన్నాకు మారుతి ఆశీర్వచనాలు..ట్రెండింగ్ లో స్టిల్
Sunitha | డబ్బు కోసం రామ్‌ను పెళ్లి చేసుకున్నానంటున్నారు..!