కలెక్షన్ కింగ్ మోహన్ బాబుకి సౌత్ ఇండస్ట్రీకి చెందిన ప్రముఖ స్టార్స్‌తో మంచి సాన్నిహిత్యం ఉంది. ముఖ్యంగా సూపర్ స్టార్ రజనీకాంత్‌ని ఏకవచనంతో పిలిచే మిత్రుత్వం ఉంది. సినీ పరిశ్రమకు చెందిన స్టార్స్ అందరితో మంచి ర్యాపో మెయింటైన్ చేస్తున్న మోహన్ బాబు అప్పుడప్పుడు వారిని తన ఇంటికి ఆహ్వానించి పసందైన విందు ఏర్పాటు చేస్తుంటాడు.
ఆ మధ్య రజనీకాంత్ రెండు రోజుల పాటు మోహన్ బాబు ఇంట్లో ఉన్నారు. మోహన్ బాబు ఫ్యామిలీతో సరదాగా గడిపిన తర్వాత ఆయన చెన్నై వెళ్లారు. ఇక తాజాగా మోహన్ బాబు ఇంటికి మోహన్ లాల్ విచ్చేసి మోహన్ బాబు ఫ్యామిలీ మొత్తాన్ని ఖుషీ చేశారు. ఏ సందర్భంలో ఆయన మోహన్ బాబు ఇంటికి వచ్చారో తెలియదు కాని మోహన్ బాబు కుటుంబంతో మోహన్ లాల్ సరదాగా ఎంజాయ్ చేస్తున్న ఫోటోలు సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తున్నాయి.
ఫొటోలలో మోహన్ లాల్ తో పాటు మోహన్ బాబు ఆయన భార్య, విష్ణు ఆయన భార్య అలాగే మంచు లక్ష్మి ఉన్నారు. సినిమా ఇండస్ట్రీలో ఉన్న ఇద్దరు Mలు ఒక లెజెండ్రీ డిన్నర్ కోసం కలుసుకున్నారని చెబుతూ మంచు లక్ష్మీ ఈ ఫోటోలను సోషల్ మీడియా వేదికగా పంచుకున్నారు. మోహన్ లాల్ రీసెంట్గా దృశ్యం 2 అనే చిత్రంతో బ్లాక్ బస్టర్ హిట్ కొట్టగా, ఈ చిత్రాన్ని తెలుగులో వెంకీ రీమేక్ చేసిన విషయం తెలిసిందే.
That's one hell of a LEGENDARY DINNER with the "M"s of the "M"ovies!! 🥰@themohanbabu @Mohanlal @iVishnuManchu @vinimanchu pic.twitter.com/v57tq49Sp9
— Lakshmi Manchu (@LakshmiManchu) August 6, 2021