BARROZ Trailer | మలయాళ స్టార్ హీరో మోహన్ లాల్ (Mohanlal) బ్యాక్ టు బ్యాక్ సినిమాల్లో నటిస్తున్నాడని తెలిసిందే వీటిలో ఒకటి బరోజ్ (BARROZ). మోహన్‌లాల్ స్వీయదర్శకత్వం వహిస్తున్నాడు. మేకర్స్ తాజాగా ట్రైలర్‌ను విడుదల చేశారు. ఆ డిగామా బంగ్లాలోపల ఎవరికీ కనిపించని భూతం ఉందంటూ ఓ చిన్నారి వాయిస్ ఓవర్‌తో మొదలైంది ట్రైలర్.
వందల సంవత్సరాలుగా నిధులు కాపాడుకుంటూ వస్తోన్న భూతం. మిగితా వారి కోసం కార్చే కన్నీరు కంటే మహత్తరమైన నిధి ఈ లోకంలో మరేది లేదంటున్నాడు బరోజ్. నిధుల తోటకు కాపాలా ఉండే బరోజ్ కథ నేపథ్యంలో సినిమా ఉండబోతున్నట్టు ట్రైలర్ చెప్పకనే చెబుతోంది.
మోహన్‌లాల్ స్వీయదర్శకత్వంలో వస్తోన్న చిత్రం BARROZ. కనకపు సింహాసనంపై రాజసం ఉట్టిపడేలా కనిపిస్తూ.. సినిమాపై హైప్ పెంచేస్తున్నాడు. Jijo Punnoose కథనందిస్తున్న ఈ మూవీని ఆశీర్వాద్ సినిమాస్ బ్యానర్‌పై ఆంటోనీ పెరంబవూరు తెరకెక్కిస్తున్నారు.
మోహన్ లాల్ మరోవైపు నందకిశోర్ దర్శకత్వంలో పాన్ ఇండియా మూవీ వృషభ లో కూడా నటిస్తున్నాడు. తెలుగు, మలయాళ బైలింగ్యువల్ చిత్రంగా వస్తోన్న ఈ చిత్రంలో టాలీవుడ్ నటుడు రోషన్ మేక కీలక పాత్రలో నటిస్తున్నాడు. అదేవిధంగా కన్నప్పతోపాటు Ram, Rambaan, L2: Empuraan మోహన్ లాల్ ఖాతాలో ఉన్నాయి.
బరోజ్ ట్రైలర్..
Dacoit | అవును వదిలేసాను కానీ అంటున్న మృణాల్ ఠాకూర్.. అడివి శేష్ డెకాయిట్ లుక్ వైరల్
Vijay Sethupathi | టాలీవుడ్ డెబ్యూకు విజయ్ సేతుపతి రెడీ.. ఇంతకీ డైరెక్టర్ ఎవరో మరి..?
Suman | హీరోలకు ఇదొక హెచ్చరిక.. అల్లు అర్జున్ అరెస్ట్‌పై సుమన్