మోహన్ వడ్లపట్ల స్వీయ దర్శకత్వంలో నిర్మించిన ‘M4M’(Motive for Murder) చిత్రానికి ప్రతిష్టాత్మక కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్లో అరుదైన గౌరవం దక్కింది. ఈ నెల 17న సాయంత్రం 6గంటలకు కేన్స్‌లోని ‘PALAIS – C’ థియేటర్లో ఈ సినిమా ప్రైవేట్ స్క్రీనింగ్ జరుగనున్నది. ఈ సందర్భంగా ముంబయ్ IMPPA ప్రివ్యూ థియేటర్లో ప్రెస్‌మీట్ నిర్వహించారు.
కేన్స్ ఫెస్టివల్లో తన సినిమా స్క్రీనింగ్ జరగడం పట్ల మోహన్ వడ్లపట్ల ఆనందం వెలిబుచ్చారు. త్వరలోనే ఈ సినిమాను తెలుగు, తమిళ, మలయాళ, హిందీ భాషల్లో విడుదల చేస్తామని ఆయన తెలిపారు. మర్డర్ మిస్టరీతో థ్రిల్లర్‌గా ఈ సినిమా రూపొందింది. అమెరికన్ నటి జో శర్మ ఇందులో ప్రధాన పాత్ర పోషించారు.