మల్లెపువ్వు, మెంటల్‌కృష్ణ, కలవరమాయే మదిలో వంటి చిత్రాలను తీసిన నిర్మాత మోహన్ వడ్లపట్ల దర్శకుడిగా మారారు. ఆయన దర్శకత్వంలో రూపొందుతున్న తాజా చిత్రం ‘ఎమ్4ఎమ్’ (మోటివ్ ఫర్ మర్దర్). సంభీత్ ఆచార్య, జోశర్మ జంటగా నటిస్తున్నారు. తెలుగు, తమిళం, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో త్వరలో విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. ఇప్పటికే రిలీజైన టీజర్‌కు అద్భుతమై స్పందన లభిస్తున్నదని, హత్యా నేపథ్యంలో ఆద్యంతం ఉత్కంఠభరితంగా సాగే థ్రిల్లర్ చిత్రమిదని, వసంత్ అందించిన సంగీతం, బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ హైలైట్‌గా నిలుస్తుందని దర్శకుడు మోహన్ వడ్లపట్ల తెలిపారు. ఈ చిత్రానికి కథ: మోహన్ వడ్లపట్ల, జోశర్మ, రాహుల్ ఆడబాల, దర్శకత్వం: మోహన్ వడ్లపట్ల.