మలయాళ మెగాస్టార్ మోహన్ లాల్ మంచి కథలతో ప్రేక్షకులకు వినోదాన్ని పంచుతున్నాడు. ఆయన చివరిగా దృశ్యం 2 చిత్రంతో ప్రేక్షకులని పలకరించాడు. ఈ చిత్రం ఓటీటీలో విడుదలై పెద్ద విజయం సాధించింది. ఇక ఇప్పుడు ప్రియదర్శన్ దర్శకత్వంలో మరక్కర్ అనే సినిమా చేస్తున్నాడు. 15వ శతాబ్దానికి చెందిన న్యావల్ చీఫ్ మహ్మద్ అలీ మరక్కర్ అలియాస్ కుంజాలి మరక్కర్ జీవితం ఆధారంగా రూపొందిన ఈ చిత్రంలో అర్జున్, సునీల్ శెట్టి, కీర్తీ సురేశ్, మంజు వారియర్, కల్యాణీ ప్రియదర్శన్ కీలక పాత్రలు పోషించారు.
ఈ చిత్రం కూడా ఓటీటీలో విడుదల కానుందని ప్రచారం జరగింది. అయితే వాటిని కొట్టి పడేస్తూ మేకర్స్ ఓ ప్రకటన చేశారు. ‘ఇంతకాలం సీల్ చేసి ఉన్న విషయాన్ని బ్రేక్ చేసి, స్టన్నింగ్ సర్ప్రైజ్గా చెబుతున్నాం. ‘మరక్కర్’ చిత్రం థియేటర్స్‌లో ఈ ఏడాది డిసెంబరు 2న విడుదల కానుంది’’ అని శుక్రవారం మోహన్‌లాల్ స్పష్టం చేశారు. తెలుగు, తమిళ, కన్నడ, హిందీ భాషల్లో అనువాదమై ప్రేక్షకుల ముందుకు రానుంది.