Draupadi 2 | చారిత్రక కథనంతో 2020లో వచ్చిన సినిమా ద్రౌపది. ఈ సినిమాకు సీక్వెల్‌గా ఇప్పుడు ద్రౌపది 2 సినిమా వస్తోంది. భారీ బడ్జెట్‌తో తెలుగు, తమిళ భాషల్లో నిర్మిస్తున్న ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. వినాయక చవితిని పురస్కరించుకుని ఈ సినిమాకు సంబంధించిన ఫస్ట్‌లుక్‌ను తాజాగా విడుదల చేశారు.
ఈ సినిమా 14వ శతాబ్దానికి చెందిన కథాంశంతో తెరకెక్కుతోంది. ఆ సమయంలో మొఘల్ చక్రవర్తులు తమిళనాడులోకి ప్రవేశించారు. ఆ సమయంలో జరిగిన ఘట్టాల ఆధారంగా ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. రక్తంతో రాసిన చారిత్రక ఘటనల ఆధారంగా ఈ సినిమా రూపొందుతుందని సినీ యూనిట్ తెలిపింది. దక్షిణ భారతదేశానికి చెందిన హోయసాల చక్రవర్తి మూడవ వీర వల్లలార్, సేంధమంగలాన్ని పాలించిన కడవరాయుల రాజులు, వీరత్వం, త్యాగం, రక్తంతో రాసిన చరిత్రకు నిదర్శనంగా నిలిచారని పేర్కొంది. ఈ సినిమా షూటింగ్లో దాదాపు 75 శాతాన్ని ముంబైలో తెరకెక్కిస్తున్నారు. మిగిలిన సన్నివేశాలను సెంజి, తిరువణ్ణామలై, కేరళలో చిత్రీకరించనున్నారు. ఈ చారిత్రక కథనం 2020లో విడుదలైన ద్రౌపతి సినిమా కథతో ఎలా అనుసంధానమవుతుందో అనే విషయం ప్రధానాంశంగా నిలుస్తోంది. ఇదే అనుసంధానం ద్వారా ఈ చిత్రం ద్రౌపతి సిరీస్‌లో రెండవ భాగంగా రూపొందుతోంది. ఈ సినిమాను ఈ ఏడాది చివరలో భారీ ఎత్తున విడుదల చేసేలా ప్లాన్ చేస్తున్నారు.
నేతాజీ ప్రొడక్షన్స్‌లో చోళ చక్రవర్తి, జి.ఎం.ఫిల్మ్ కార్పొరేషన్ సంయుక్తంగా ఈ సినిమాను రూపొందిస్తున్నారు. ఇది వరకు పళయ వన్నారపేట్టై, ద్రౌపది, రుద్ర తాండవం, బకాసురన్ వంటి విజయవంతమైన చిత్రాలను తెరకెక్కించిన మోహన్.జి ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. రిచర్డ్ రిషి, రక్షణ ఇందుసుదన్ ఈ చిత్రంలో ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. నట్టి నటరాజ్ కీలక పాత్రలో కనిపించనున్నారు. వై.జి.మహేంద్రన్, నాడోడిగల్ భరణి, శరవణ సుబ్బయ్య, వేల్ రామమూర్తి, సిరాజ్ జానీ, దినేష్ లాంబా, గణేష్ గౌరంగ్, దివి, దేవయాని శర్మ, అరుణోదయన్ తదితరులు ఇతర పాత్రల్లో నటిస్తున్నారు.
మోహన్.జి, పద్మ చంద్రశేఖర్ డైలాగ్స్ రాస్తున్న ఈ చిత్రానికి జిబ్రాన్ మ్యూజిక్, ఫిలిప్ ఆర్.సుందర్ సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు. థనికా టోని కొరియోగ్రఫీ, యాక్షన్ సంతోష్, ఎడిటర్‌గా దేవరాజ్, ఆర్ట్ డైరెక్టర్‌గా కమలనాథన్ బాధ్యతలు నిర్వహిస్తున్నారు.