14వ శతాబ్దానికి చెందిన కథాంశంతో తమిళ, తెలుగు భాషల్లో రూపొందిస్తున్న చిత్రం ‘ద్రౌపతి-2’. రిచర్డ్ రిషి, రక్షణ ఇందుసుదన్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. మోహన్ జి. దర్శకుడు. ప్రస్తుతం ఈ సినిమా చిత్రీకరణ జరుపుకుంటున్నది.
దక్షిణాదికి చెందిన హోయసాల చక్రవర్తి మూడవ వీర వల్లలార్, సేంధమంగలాన్ని పాలించిన కడవరాయుల రాజులు వీరత్వాన్ని, ధైర్యసాహసాలను ఈ చిత్రంలో ఆవిష్కరిస్తున్నామని, మొఘల్ రాజులకు వ్యతిరేకంగా వారు చేసిన పోరాటం ప్రధాన ఇతివృత్తంగా ఉంటుందని మేకర్స్ తెలిపారు. అధికభాగం షూటింగ్‌ను ముంబయిలో జరుపుతున్నామని, కొంతపార్ట్ను తిరువణ్ణామలై, కేరళలో తెరకెక్కిస్తామని దర్శకుడు తెలిపారు. ఈ చిత్రాన్ని ఈ సంవత్సరాంతంలో విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు.