Manchu Mohan Babu | ప్రముఖ సినీ నటుడు మంచు మోహన్ బాబు ఇంటి వద్ద మరోసారి ఉద్రిక్త వాతావరణం నెలకొన్నది. జల్పల్లిలోని నివాసం వద్దకు మనోజ్ వచ్చాడు. అయితే, ఇంట్లోకి రానివ్వకపోవడంతో గేట్లు తీసుకుంటూ ఇంట్లోకి వెళ్లాడు. ఈ క్రమంలో మోహన్‌బాబు, మనోజ్‌కు మధ్య మరోసారి గొడవ జరిగింది. మనోజ్ చిరిగిన చొక్కాతో బయటకు వెళ్లిపోయాడు. ఆ తర్వాత మీడియా ప్రతినిధులపై మోహన్‌బాబు ఆగ్రహంతో ఊరిగిపోయారు. ఆ తర్వాత మీడియా ప్రతినిధులను ఇంట్లో నుంచి బయటకు వెళ్లగొట్టి గేట్లకు తాళవేశారు. అనంతరం మోహన్‌బాబు ఆడియో సందేశాన్ని విడుదల చేశారు. ఇందులో ఆయన మాట్లాడుతూ.. అందరికంటే ఎక్కువగా మనోజ్‌ను గారాబంగా పెంచానన్నారు. మనోజ్ నువ్వు ఏది అడిగినా ఇచ్చాననని.. మనోజ్ నీ ప్రవర్తనతో నా మనసు కుంగిపోతుందన్నారు. మనోజ్ నన్ను తాకలేదు.. కొన్ని కారణాలతో ఘర్షణ పడ్డామన్నారు. ప్రతి కుటుంబంలో ఘర్షణలు ఉంటయన్నారు. జల్పల్లి ఇల్లు నా కష్టార్జితం.. నీకు సంబంధం లేదన్నారు.
మంచు మనోజ్ మద్యానికి బానిసగా మారాడని.. ఇంట్లో పనిచేసే వారిపై దాడికి దిగడం మనోజ్ సరికాదని పేర్కొన్నారు. మనోజ్ నీవల్ల మీ అమ్మ ఆసుపత్రిలో చేరిందని.. భార్య మాటలు విని తాగుడుకు అలవాటుపడ్డావని ఆరోపించారు. తప్పు చేయనని మళ్లీ ఇంట్లోకి వచ్చావని.. ఇక చాలు ఇంతటితో గొడవు ముగింపు పలుకుదామన్నారు. నా ఇంట్లోకి అడుగుపెట్టడానికి నీకు అధికారం లేదని.. నన్ను ఎవరూ మోసగాడు అనలేదన్నారు. నా పరువు, ప్రఖ్యాతలు మనోజ్ మంటగలిపాడని.. నీకు జన్మనివ్వడమేనా నేను చేసిన పాపమన్నారు. ఆస్తులు ముగ్గురికి సమానంగా రాయాలా.. లేదా అనేది నా ఇష్టమని.. ఆస్తులు ఇస్తానా? లేక ధానధర్మాలు చేస్తానా? అనేది నా ఇష్టమన్నారు. మా నాన్న ఆస్తులు ఇవ్వలేదు.. అయినా నేను సంపాదించుకున్నానన్నారు. నా ఇంట్లోకి నువ్వే అక్రమంగా చొరబడ్డావ్.. నా మనుషులను కొట్టవన్నారు. నాకు రక్షణ కావాలని పోలీసులను కోరానన్నారు. మనోజ్ వచ్చి తన కూతురును తీసుకువెళ్లాలని.. నా దగ్గర వదిలిపెట్టినా ఇబ్బంది లేదన్నారు. పోలీసుల సమక్షంలోనే నీ బిడ్డను నీకు అప్పగిస్తానని.. జరిగిన సంఘటనతోనే మీ అమ్మ ఆసుపత్రిలో చేరిందన్నారు. విద్యా సంస్థల్లో ప్రతీది లీగల్‌గా ఉంది.. తప్పుడు ఎక్కడా జరుగలేదని స్పష్టం చేశారు.