Mohan Babu | జల్పల్లిలోని మోహన్‌బాబు ఇంటి వద్ద హైటెన్షన్ కొనసాగుతున్నది. మోహన్ బాబు ఇంటికి మనోజ్ చేరుకోగా.. అక్కడ భద్రతా సిబ్బంది అడ్డుకున్నారు. మనోజ్ సెక్యూరిటీ సిబ్బందితో వాగ్వాదానికి దిగాడు. తమ ఏడు నెలల పాప లోపలే ఉందని.. గేట్లు తీయాలంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆ తర్వాత పరిస్థితి ఒక్కసారిగా అదుపు తప్పింది. మోహన్‌బాబు మీడియా ప్రతినిధులపై రెచ్చిపోయారు. ఆయనపై చర్యలు తీసుకోవాల్సిందేనని మీడియా ప్రతినిధులు ఆందోళన చేపట్టారు. మరో వైపు మోహన్‌బాబు ఆసుపత్రికి వెళ్లారు. గచ్చిబౌలిలోని కాంటినెంటర్ ఆసుపత్రిలో చేరారు. జల్పల్లిలోని నివాసం వద్ద ఘర్షణ సమయంలో కాలికి గాయమైనట్లు సమాచారం. ఈ క్రమంలోనే తనయుడు విష్ణుతో కలిసి ఆయన ఆసుపత్రికి వెళ్లారని తెలుస్తోంది. ప్రస్తుతం ఆయనకు కాంటినెంటల్ ఆసుపత్రి వైద్యులు చికిత్స అందిస్తున్నారు. ఇంకా పూర్తి వివరాలు తెలియాల్సి ఉన్నది. మరో వైపు మోహన్‌బాబు ఇంట్లోకి వెళ్లిన మంచు మనోజ్.. తన కూతురుని దగ్గరకు తీసుకున్నట్లు సమాచారం.