‘ఈ సినిమా విషయంలో తొలుత ఎన్నో ఇబ్బందులు ఎదురయ్యాయి. రిలీజ్ డేట్ కరెక్టేనా అని చాలాసార్లు అనుకున్నాం. అయితే మా టెన్షన్స్ అన్నింటిని పటాపంచలు చేస్తూ విడుదలైన అన్ని కేంద్రాల్లో చిత్రానికి అద్భుతమైన స్పందన లభిస్తున్నది’ అని అన్నారు నవీన్ పొలిశెట్టి. ఆయన అనుష్కతో కలిసి నటించిన ‘మిస్ శెట్టి మిస్టర్ పొలిశెట్టి’ చిత్రం ఇటీవలే ప్రేక్షకుల ముందుకొచ్చింది.
శనివారం బ్లాస్‌బస్టర్ సెలబ్రేషన్స్‌ను ఘనంగా నిర్వహించారు. నవీన్ పొలిశెట్టి మాట్లాడుతూ ‘మౌత్‌టాక్‌తోనే ఈ సినిమా ఇంతటి విజయం సాధించింది. ఈ పాయింట్‌ను ప్రేక్షకులు ఎలా అంగీకరిస్తారో అనుకున్నాం. మెగాస్టార్ చిరంజీవిగారు ఈ సినిమా చూసి మాతో రెండు గంటలు మాట్లాడారు. సినిమా తప్పకుండా హిట్ అవుతుందని చెప్పారు. ఆయన చెప్పిన విధంగానే ఫలితం వచ్చింది’ అన్నారు. ఈ సినిమా ప్రయాణంలో తనకు అందరూ అండగా నిలిచారని చిత్ర దర్శకుడు మహేష్‌బాబు చెప్పారు.