సోమవారం 01 జూన్ 2020
Cinema - Apr 28, 2020 , 12:47:32

త‌న భ‌ర్త‌తో దిగిన ఫోటోని షేర్ చేసిన మిర్చి బ్యూటీ

త‌న భ‌ర్త‌తో దిగిన ఫోటోని షేర్ చేసిన మిర్చి బ్యూటీ

'లీడర్'.. 'మిరపకాయ్'.. సారొచ్చారు వంటి తెలుగు చిత్రాల‌లో న‌టించిన రిచా గంగోపాధ్యాయ్ .. మిర్చి సినిమాతో అంద‌రి దృష్టిని ఆక‌ర్షించింది. 2013 త‌ర్వాత సినిమాల‌కి గుడ్‌బై చెప్పిన ఈ అమ్మ‌డు అమెరికాకి వెళ్ళింది. అక్క‌డే జో లాంగెల్లా అనే ఓ అమెరికన్ ను పెళ్ళి చేసుకుని వైవాహిక జీవితంలోకి అడుగుపెట్టింది.

తాజాగా  రిచా తన భర్త జో లాంగెల్లాతో కలిసి ఉన్న ఫోటోను పోస్ట్ చేసి "ఓల్డ్ పిక్. సేమ్ మ్యాన్.. న్యూ నేమ్. #రిచా లాంగెల్లా #ఇట్స్ అఫీషియల్ #బై గంగోపాధ్యాయ్" అంటూ క్యాప్షన్ ఇచ్చింది. ఇటీవ‌ల ఇన్‌స్టాలోకి కూడా ఎంట్రీ ఇచ్చింది ఈ అమ్మడు. రిచా షేర్ చేసిన పాత ఫోటో అయిన‌ప్ప‌టికీ  చాలా ఫ్రెష్‌గా ఉంద‌ని నెటిజ‌న్స్ కామెంట్స్ పెడుతున్నారు 


logo