హీరోయిన్లనే తలదన్నే అందం ఆమె సొంతం. ఆమె ఒక్క స్టిల్ పెట్టిందంటే ఆ ఫొటోకు లైకులే లైకులు. అందరినీ చూపు పక్కకు తిప్పుకోనీయకుండా చేసే నాజూకు ముద్దుగుమ్మ..ఎప్పుడు ఏదో ఒక పోస్టుతో నెటిజన్లలో జోష్ నింపుతుంటుంది. ఇంతకీ ఆమె ఎవరో తెలుసా..? బాలీవుడ్ హీరో షాహిద్ కపూర్ భార్య మీరా రాజ్‌పుత్.
ఈ భామ స్విమ్మింగ్ ను ఎంజాయ్ చేసేందుకు రెడీ అవుతున్న స్టిల్ ఒకటి నెట్టింట్లో హల్చల్ చేస్తోంది. ట్విన్ కలర్ స్విమ్షూట్, వైట్ స్లీపర్స్ లో ఉన్న మీరా రాజ్‌పుత్ తన అందంతో మతులు పోగొడుతుంది.
స్విమ్‌కు వెళ్లేముందు స్టైలిష్ గాగుల్స్ పెట్టుకుని కెమెరాకు పోజులిచ్చింది మీరా రాజ్‌పుత్. ఈ ఫొటోను ఇన్ స్టాగ్రామ్ లో పోస్ట్ చేస్తూ..మెస్‌కు కొన్ని నిమిషాల ముందు..అంటూ క్యాప్షన్ ఇచ్చింది.