Mirai | టాలీవుడ్లోనే కాదు ఇప్పుడు దేశ వ్యాప్తంగా ఒకే ఒక్క సినిమా గురించే అందరి చర్చ. అదే తేజ సజ్జ నటించిన మిరాయ్. సెప్టెంబర్ 12న గ్రాండ్‌గా విడుదలైన ఈ విజువల్ వండర్ ఆడియన్స్‌ను ఎంతగానో ఆకట్టుకుంది. రిలీజ్ రోజే యూనానిమస్ బ్లాక్‌బస్టర్ టాక్‌తో మిరాయ్ బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల వర్షం కురిపిస్తోంది. కథ, స్క్రీన్‌ప్లే, గ్రాఫిక్స్, విజువల్ ఎఫెక్ట్స్, మ్యూజిక్ ఇలా ప్రతి అంశంలో మిరాయ్ ప్రేక్షకులను అద్భుతంగా ఎంగేజ్ చేస్తోంది. సినిమాను చూసిన వారు “ఇది టాలీవుడ్ సినిమా కాదు హాలీవుడ్ రేంజ్!” అంటూ కామెంట్లు చేస్తున్నారు. సోషల్ మీడియాలో #MiraiStorm ట్రెండింగ్‌లోకి వచ్చేసింది.
మేకర్స్ విడుదల చేసిన అధికారిక గణాంకాల ప్రకారం, మిరాయ్ మొదటి రోజే దేశవ్యాప్తంగా రూ. 27.20 కోట్ల వసూళ్లను రాబట్టింది. ఇది ఈ ఏడాది విడుదలైన సినిమాల్లో ఒక టాప్ ఓపెనింగ్గా నిలిచింది. అదే సమయంలో, ఇలాంటి ఫలితాన్ని ఎలాంటి టికెట్ రేట్ల పెంపు లేకుండానే సాధించడం గమనార్హం. ఈ మూవీ బడ్జెట్ రూ.60 కోట్లు కాగా, ఫస్ట్ డే కలెక్షన్ (ఇండియా): రూ.27.20 కోట్లు, నార్త్ అమెరికా కలెక్షన్ (Day 1): $700,000+ (దాదాపు రూ.6 కోట్లు) రాబట్టింది. తేజ సజ్జ నటించిన హనుమాన్ మూవీ ఫస్ట్ డే రూ.10 కోట్లు వసూలు చేసిన సంగతి తెలిసిందే. ఇప్పుడు మిరాయ్ ఆ రికార్డును తలకిందలు చేసింది. విడుదలైన మొదటిరోజే రెండు మూడింతల వసూళ్లు సాధించి, 2025లో టాలీవుడ్లో నెంబర్ వన్ ఓపెనర్‌గా నిలిచింది.
ఇప్పటికే సినిమా పాజిటివ్ టాక్‌తో దూసుకుపోతుండటంతో, వీకెండ్లో కలెక్షన్లు మరింత పెరిగే అవకాశం ఉందని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. ముఖ్యంగా మల్టిప్లెక్స్, అర్బన్ ఏరియాల్లో టికెట్ డిమాండ్ ఎక్కువగా ఉందని తెలుస్తోంది. మొదటి రోజు కలెక్షన్లను చూసి ఉబ్బితబ్బిబయిన మేకర్స్, “బ్రహ్మాండ బ్లాక్‌బస్టర్” అంటూ కొత్త పోస్టర్‌ను విడుదల చేశారు. ఇందులో మిరాయ్ విజువల్స్‌కి బిగ్ స్క్రీన్ రెస్పాన్స్ని హైలైట్ చేశారు. మొత్తానికి మిరాయ్ టాలీవుడ్లో ఓ కొత్త ట్రెండ్‌ను సెట్ చేసింది.. కంటెంట్, టెక్నికల్ వాల్యూస్, ప్రెజెంటేషన్ అన్నీ ప్రేక్షకులకు ఓ హై ఎండ్ సినిమా అనుభవాన్ని ఇస్తోంది. ఈ జోరు చూస్తుంటే, మిరాయ్ మరిన్ని రికార్డులు బద్దలు కొట్టడం ఖాయంగా కనిపిస్తుంది.