Minister Srinivas Yadav | టాలీవుడ్ సీనియర్ నటుడు శరత్ బాబు సోమవారం ఆరోగ్య సమస్యలతో ఆసుపత్రిలో చికత్స పొందుతూ కన్నుమూశారు. ఆయన మృతికి తెలంగాణ సినిమాటోగ్రఫీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ సంతాపం ప్రకటించారు. హీరోగా, విలన్గా, సహాయ నటుడిగా ఏ పాత్రలోనైనా తన నటనతో ప్రేక్షకులను మెప్పించిన విలక్షణ నటుడు శరత్ బాబు అన్నారు. 1973లో రామరాజ్యం చిత్రం ద్వారా సినిమా పరిశ్రమలోకి అడుగుపెట్టారు. తెలుగు, తమిళం తదితర భాషలలో 300పైగా చిత్రాల్లో నటించారు. సంసారం ఒక చదరంగం, మరో చరిత్ర, మూడుముళ్ల బంధం, సాగర సంగమం, ఆపద్బాంధవుడు తదితర చిత్రాల్లో నటించి ప్రేక్షకుల మన్ననలు పొందారు. శరత్ బాబు మృతి చిత్ర పరిశ్రమతో పాటు అభిమానులకు తీరని లోటన్నారు. ఆయన కుటుంబ సభ్యులకు మనోధైర్యం కల్పించాలని ఆ భగవంతుడిని ప్రార్థిస్తున్నానని మంత్రి శ్రీనివాస్ యాదవ్ పేర్కొన్నారు.