రచయిత డైమండ్ రత్నబాబు దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రం ‘అన్ స్టాపబుల్’. అన్ లిమిటెడ్ ఫన్ అనేది ఉపశీర్షిక. బిగ్‌బాస్ ఫేమ్ విజే సన్నీ, సప్తగిరి హీరోలుగా నటిస్తున్న ఈ చిత్రంలో నక్షత్ర, అక్సాఖాన్ హీరోయిన్లు.
ఎ2బీ ఇండియా ప్రొడక్షన్స్‌లో రజిత్‌రావు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. శుక్రవారం ఈ చిత్రం విడుదల తేదీని మంత్రి మల్లారెడ్డి అనౌన్స్ చేశారు. జూన్ 9న ప్రపంచవ్యాప్తంగా ఈ చిత్రం విడుదల కానుంది. భీమ్స్ సిసిరోలియో ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నారు.