MeToo | సల్మాన్ ఖాన్ హోస్ట్ చేస్తోన్న హిందీ బిగ్ బాస్-16 కంటెస్టెంట్, బాలీవుడ్ దర్శకుడు సాజీద్ ఖాన్‌పై ‘MeToo’ ఆరోపణలు వెల్లువెత్తుతూనే ఉన్నాయి. ఇప్పటికే పలువురు నటీమలు సాజిద్ తమను లైంగికంగా వేధించాడని ఆరోపించిన విషయం తెలిసిందే. షెర్లిన్ చోప్రా నుంచి మందన కరీమి, కనిష్కా సోని, ఆహానా కుమ్రా, సలోని చోప్రా, రాణి ఛటర్జీ వరకు సాజిద్ తమను వేధింపులకు గురి చేశాడని ఆరోపించారు. తాజాగా మరాఠీ నటి జయశ్రీ గైక్వాడ్ సైతం సాజిద్ ఖాన్‌పై లైంగిక వేధింపుల ఆరోపణలు చేసింది.
డైరెక్టర్‌తో తనకు జరిగిన చేదు అనుభవాన్ని ఓ వీడియోలో తెలిపింది. పని నిమిత్తం సాజిద్‌ఖాన్‌ను కలిసేందుకు వెళ్లినప్పుడు తనతో అసభ్యంగా ప్రవర్తించాడని జయశ్రీ ఆరోపించింది. తాను మరాఠీ, హిందీ చిత్ర పరిశ్రమలో చాలాకాలం నుంచి పని చేస్తున్నానని, ఎనిమిదేళ్ల కిందట ఓ కాస్టింగ్ డైరెక్టర్ నన్ను సాజిద్ ఖాన్‌ను పరిచయం చేశాడని చెప్పింది. దాంతో రేపు ఆఫీసుకు రావాలని, నేను ఓ సినిమా చేస్తున్నానని.. అందులో ఏదో అవకాశం రావొచ్చని చెప్పాడని తెలిపింది. అతను చెప్పినట్లుగా ఆఫీస్‌కి వెళితే.. తనను అక్కడక్కడ చేతులు వేస్తూ.. చెత్త కామెంట్లు చేశాడని చెప్పింది.
నువ్వు చాలా అందంగా ఉన్నావు.. నీకు ఎందుకు పని ఇవ్వాలి? అని అడిగాడని చెప్పుకొచ్చింది. తాను ఏం కావాలని అడిగానని, తాను బాగా నటిస్తానని చెబితే.. నటన పనికిరాదన్నాడని చెప్పింది. నేను చెప్పినా చేయాలని చెప్పాడని.. దాంతో ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఆఫీస్ నుంచి వెళ్లిపోయానంటూ తనకు జరిగిన చేదు అనుభవాన్ని జయశ్రీ వివరించింది. ఇప్పటికే చాలా మంది నటీమణులు సాజిద్‌పై లైంగిక ఆరోపణలు చేశారు. ఆ తర్వాత అతని కెరీర్ కష్టాల్లో పడింది. ప్రస్తుతం బిగ్‌బాస్-16 కంటెస్టెంట్‌గా ఉండగా.. షో నుంచి బయటకు పంపాలనే డిమాండ్లు వచ్చాయి.