బ్లాక్బస్టర్ ‘బిచ్చగాడు’ తర్వాత శశి దర్శకత్వంలో విజయ్ ఆంటోని నటిస్తున్న చిత్రం ‘వంద దేవుళ్లు’. స్వాసిక కథానాయిక. రామాంజనేయులు జవ్వాజి నిర్మాత. మే నెలలో సినిమా విడుదల కానున్నది. తాజాగా ఈ సినిమా నుంచి ‘ఇది కలనో.. మాయ వలనో’ అంటూ సాగే మెలోడీ గీతాన్ని బుధవారం విడుదల చేశారు. భాగ్యశ్రీ ఈ పాట రాయగా, బాలాజీ శ్రీరామ్ స్వరపరిచారు. శిభి శ్రీనివాసన్, శిరీష భాగవతుల ఆలపించారు. ఈ పాటలో విజయ్ ఆంటోని, స్వాసిక కనిపిస్తున్న తీరు, ప్రేమను వ్యక్తం చేస్తున్న విధానం ఆసక్తికరంగా ఉంది. అజయ్, కావ్య, కార్నాస్, బాలాజీ శక్తివేల్, దివాకర్, అరుళ్దాస్ తదితరులు ఇతర పాత్రలు పోషిస్తున్న ఈ చిత్రానికి కెమెరా: ఎస్బీ దర్శన్ కిర్లోష్, సంగీతం: బాలాజీ శ్రీరామ్, సమర్పణ: ఫాతిమా విజయ్ ఆంటోని, నిర్మాణం: విజయ్ ఆంటోని ఫిల్మ్ కార్పొరేషన్, సర్వంత్ రామ్ క్రియేషన్స్.