నరేష్ ఆగస్త్య, రబియా ఖాతూన్ జంటగా నటించిన చిత్రం ‘మేఘాలు చెప్పిన ప్రేమకథ’. విపిన్ దర్శకత్వం వహించిన ఈ చిత్రానికి ఉమాదేవి కోట నిర్మాత. మ్యూజికల్ రొమాంటిక్ ఎంటర్టైనర్గా రూపొందిన ఈ చిత్రం ఆగస్ట్ 22న విడుదల కానుంది. శుక్రవారం ట్రైలర్‌ను విడుదల చేశారు. క్లీన్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ ఇదని..వినోదం, భావోద్వేగాలు ప్రధానంగా ఆకట్టుకుంటుందని దర్శకుడు తెలిపారు.
ఫ్యామిలీ ఎలిమెంట్స్‌తో పాటు హృదయాన్ని స్పృశించే ప్రేమకథతో ఈ సినిమా అందరినీ మెప్పిస్తుందని హీరో నరేష్ ఆగస్త్య అన్నారు. రాధిక శరత్‌కుమార్, తనికెళ్ల భరణి, విద్యుల్లేఖ, సుమన్ తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి సంగీతం: జస్టిన్ ప్రభాకరన్, రచన-దర్శకత్వం: విపిన్.