Syam Benegal | ప్రముఖ సినీ దర్శకులు శ్యామ్ బెనగల్ మృతి పట్ల మెగాస్టార్ చిరంజీవి సంతాపం తెలిపారు. దేశంలోని అత్యుత్తమ సినీ దర్శకులు, గొప్ప మేధావుల్లో శ్యామ్ బెనగల్ ఒకరని చిరంజీవి పేర్కొన్నారు. చలన చిత్ర రంగంలో వెలుగొందిన కొంత మంది ప్రముఖుల్లో ప్రతిభను గుర్తించి ప్రోత్సహించారన్నారు. శ్యామ్ బెనగల్ సినిమాలు, జీవిత చరిత్రలు, డాక్యుమెంటరీలు భారత గొప్ప సాంస్కృతిక సంపదలో భాగం అన్నారు. హైదరాబాద్ వాసి, రాజ్యసభ సభ్యుడు శ్యామ్ బెనగల్ అద్భుతమైన సినిమాలు తీశారని పేర్కొన్నారు. ఆయన సినిమాలు భారత చలన చిత్ర రంగంలో ఎల్లప్పుడూ గౌరవాన్ని పొందుతాయని వ్యాక్యానించారు.