మెగాస్టార్ చిరంజీవి అందరివాడులా మారి కష్టాలలో ఉన్నవారికి తన వంతు సాయం అందిస్తూ మన్ననలు అందుకుంటున్నారు. ఇటీవలి కాలంలో ప్రముఖ జర్నలిస్ట్ టీఎన్ఆర్ అనారోగ్యంతో మరణించగా ఆయన కుటుంబానికి లక్ష రూపాయలు సాయం అందించారు. తాజాగా పావలా శ్యామలా, కారవ్యాన్ డ్రైవర్ జయరాంకు కూడా ఆర్ధిక సాయం చేశారు. అయితే గత ఏడాది నుండి కిడ్నీ సమస్యలతో బాధపడుతున్న పొన్నాంబళంకు రెండు లక్షల సాయం చేశారట చిరు. ఈ విషయాన్ని తాజాగా ఓ వీడియో ద్వారా తెలియజేశారు.
‘చిరంజీవి అన్నయ్యకు నమస్కారం, చాలా ధన్యవాదాలు అన్నయ్యా… నాకు కిడ్నీ ట్రాన్స్‌ప్లాంటేషన్ కోసం మీరు పంపిన రెండు లక్షల రూపాయలు చాలా ఉపయోగపడ్డాయి. ఈ సహాయాన్ని నేనెప్పటికీ మరచిపోలేను. మీకు మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. మీ పేరున్న ఆ దేవుడు ఆంజనేయస్వామి మిమ్మల్ని చిరంజీవిగా ఉంచాలని కోరుకుంటూ… జై శ్రీరామ్’ అని పొన్నాంబళం ఎమోషనల్ అయ్యారు పొన్నంబళం. ఆయన తెలుగుతో పాటు తమిళంలో ఎన్నో సినిమాల్లో విలన్‌గా నటించి అలరించిన విషయం తెలిసిందే.
Boss @KChiruTweets has donated Rs.2 Lakh Rupees for Actor #Ponnambalam who is suffering with kidney problem . pic.twitter.com/De8weSmPni
— Chiranjeevi Trends™ (@TrendsChiru) May 21, 2021
ఇవి కూడా చదవండి..
అనంతగిరిలో కొవిడ్ హాస్పిటల్‌ను ఏర్పాటు చేస్తాం
రోడ్డు వెడల్పు పనులను పరిశీలించిన మంత్రి అల్లోల
బావిలోంచి బాలుడి మృతదేహం వెలికితీత
సుందర్ లాల్ బహుగుణ మృతి పట్ల మంత్రి ఐకే రెడ్డి సంతాపం