Megastar Chiranjeevi | ఆంధ్రప్రదేశ్(Andhra Pradesh) రాష్ట్రంలో కొత్త ప్రభుత్వం కొలువుదీరింది. ఏపీ నూతన ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు(Cm Chandrababu Naidu)తో పాటు ఉప ముఖ్యమంత్రిగా పవన్ కల్యాణ్ (Pawan Kalyan) ప్రమాణస్వీకారం చేశారు. ఇక మంత్రిగా పవన్ కళ్యాణ్ ప్రమాణ స్వీకారం చేయడంతో రాజకీయ ప్రముఖులతో పాటు సినీ ప్రముఖులు జనసేనానికి శుభాకాంక్షలు తెలుపుతున్నారు. ఈ క్రమంలోనే సినీనటుడు చిరంజీవి ఎక్స్ వేదికగా చంద్రబాబుతో పాటు పవన్ కళ్యాణ్‌కు శుభాకాంక్షలు తెలిపాడు.
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా నాలుగో సారి ప్రమాణస్వీకారం చేసిన నారా చంద్రబాబునాయుడు గారికి, డిప్యూటీ సీఎం కొణిదల పవన్ కళ్యాణ్ గారికి, మిగతా మంత్రి వర్గానికి హార్దిక శుభాకాంక్షలు. ఆంధ్రప్రదేశ్ సర్వతోముఖాభివృద్ధి కి అహర్నిశం పాటుపడే అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటారని ప్రగాఢంగా విశ్వసిస్తున్నాను….ఆశిస్తున్నాను.!! అంటూ చిరు రాసుకోచ్చాడు.
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా నాలుగో సారి ప్రమాణస్వీకారం చేసిన @ncbn
నారా చంద్రబాబునాయుడు గారికి,
డిప్యూటీ సి ఎం @PawanKalyan కొణిదల పవన్ కళ్యాణ్ గారికి, మిగతా మంత్రి వర్గానికి హార్దిక శుభాకాంక్షలు. ఆంధ్రప్రదేశ్ సర్వతోముఖాభివృద్ధి కి అహర్నిశం పాటుపడే అవకాశాన్ని సద్వినియోగం…— Chiranjeevi Konidela (@KChiruTweets) June 12, 2024