Salaar Movie | పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ (Prabhas) ప్రధాన పాత్రలో నటించిన తాజా చిత్రం సలార్ – పార్ట్ 1 సీజ్ ఫైర్ (Salaar Part 1 Cease Fire). ‘కేజీయఫ్’ ఫేమ్ ప్రశాంత్ నీల్ (Prashanth Neel) ఈ సినిమాకు దర్శకత్వం వహించాడు. భారీ అంచనాల నడుమ శుక్రవారం ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ సినిమాకు అంతటా పాజిటివ్ రెస్పాన్స్ రావడంతో భారీ ఓపెనింగ్స్ రాబడుతున్నది. దీంతో ప్రభాస్ ఫ్యాన్స్‌తో పాటు ప్రేక్షకులు సైతం ఈ సినిమా చూసేందుకు బారులుతీరున్నారు. అయితే ఈ సినిమా చూసిన మెగాస్టార్ చిరంజీవి సలార్‌పై ప్రశంసలు కురిపించాడు.
డియర్ దేవా (ప్రభాస్)కి ముందుగా శుభాకాంక్షలు తెలుపుతున్నాను. సలార్ సీజ్ ఫైర్ బాక్సాఫీస్ వద్ద అదరగొడుతుంది. అద్భుతమైన సినిమాను తెరకెక్కించిన దర్శకుడు ప్రశాంత్ నీల్ కు కుడోస్. పృథ్విరాజ్ సుకుమారన్, శృతి హాసన్, జగపతి బాబు ఈ సినిమాలో అద్భుతంగా నటించారు. మిగతా టెక్నీకల్ టీం అంతా సినిమా కోసం ఎంతో కష్టపడ్డారు. ప్రతి ఒక్కరికీ అభినందనలు అంటూ చిరు ట్విట్టర్లో రాసుకొచ్చారు. ఇక ఈ మూవీకి చిరు రివ్యూ ఇవ్వడంతో ప్రభాస్ ఫ్యాన్స్ సంతోషంలో మునిగిపోతున్నారు.
Heartiest Congratulations my dear ‘Deva’ #RebelStar #Prabhas 🤗#SalaarCeaseFire has put the Box Office on Fire 🔥🔥
Kudos to Director #PrashanthNeel on this remarkable achievement. You truly excel at world building.
My love to the Superb ‘Varadaraja Mannar’ @PrithviOfficial…
— Chiranjeevi Konidela (@KChiruTweets) December 23, 2023