Chiranjeevi | నాకు క్యాన్సర్ రాలేదు.. మీడియాలో వస్తున్న కథనాలపై చిరంజీవి రియాక్షన్
Chiranjeevi | తాను క్యాన్సర్ బారిన పడ్డానని శనివారం మీడియాలో ప్రసారమైన వార్తల్ని ఖండించారు అగ్ర నటుడు చిరంజీవి. శనివారం హైదరాబాద్ నానక్‌రామ్‌గూడాలోని స్టార్ ఆస్పత్రిలో ఏర్పాటు చేసి క్యాన్సర్ విభాగాన్ని ఆయన ప్రారంభించారు.
Chiranjeevi | తాను క్యాన్సర్ బారిన పడ్డానని శనివారం మీడియాలో ప్రసారమైన వార్తల్ని ఖండించారు అగ్ర నటుడు చిరంజీవి. శనివారం హైదరాబాద్ నానక్‌రామ్‌గూడాలోని స్టార్ ఆస్పత్రిలో ఏర్పాటు చేసి క్యాన్సర్ విభాగాన్ని ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడిన చిరంజీవి గతంలో తాను చేయించుకున్న ముందస్తు పరీక్షల వల్ల క్యాన్సర్ బారిన పడే ప్రమాదం నుంచి తప్పించుకున్నానని తెలిపారు. అయితే చిరంజీవి మాటల్లోని మెడికల్ పరిభాషను సరిగ్గా అర్థం చేసుకోకపోవడంతో ఆయన క్యాన్సర్ బారిన పడి కోలుకున్నారని వివిధ మాధ్యమాల్లో వార్తలు ప్రసారమయ్యాయి.
వీటిని ఖండిస్తూ ట్విట్టర్ వేదికగా స్పందించారు చిరంజీవి. ‘నేను క్యాన్సర్ పట్ల అవగాహన కలిగి ఉండాలని , రెగ్యులర్‌గా వైద్య పరీక్షలు చేయించుకుంటే వ్యాధిని నివారించవొచ్చని చెప్పాను. గతంలో నేను కొలనోస్కోపీ టెస్ట్ చేయించుకున్నాను. అందులో క్యాన్సర్ రహిత పాలిప్స్‌ని గుర్తించి తొలగించారు. ఒకవేళ ముందుగా పరీక్ష చేయించుకోకుండా ఉంటే అది క్యాన్సర్ కింద మారేదేమో అని చెప్పాను. అయితే కొన్ని మీడియా సంస్థలు నా మాటల్ని సరిగ్గా అర్థం చేసుకోకుండా అవగాహనరాహిత్యంతో నేను క్యాన్సర్ బారిన పడ్డానని, చికిత్స వల్ల బతికానని వార్తలు ప్రసారం చేశారు. నా ఆరోగ్యం గురించి వాకబు చేస్తూ నా శ్రేయోభిలాషులు, అభిమానులు సందేశాలు పంపిస్తున్నారు. విషయాన్ని అర్థం చేసుకోకుండా అవాకులు, చవాకులు రాయకండి. దీనివల్ల అందరిని బాధపెట్టిన వారవుతారు’ అని చిరంజీవి ట్విట్టర్లో పేర్కొన్నారు.
కొద్ది సేపటి క్రితం నేనొక క్యాన్సర్ సెంటర్ ని ప్రారంభించిన సందర్భంగా క్యాన్సర్ పట్ల అవగాహన పెరగాల్సిన అవసరం గురించి మాట్లాడాను. రెగ్యులర్ గా మెడికల్ టెస్టులు చేయించుకుంటే క్యాన్సర్ రాకుండా నివారించవచ్చు అని చెప్పాను. నేను అలర్ట్ గా వుండి కొలోన్ స్కోప్ టెస్ట్…
— Chiranjeevi Konidela (@KChiruTweets) June 3, 2023
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Batukamma | మెట్ల బావి వద్ద బతుకమ్మ సందడి.. మహిళలతో కలిసి కోలాటం ఆడిన ఎమ్మెల్యే..!
CM Revanth Reddy | ఇక నేనేం చేయలేను.. పరిస్థితి చేయి దాటిపోయేలా ఉంది..!
Nirudyoga Batukamma | తంగేడు పూల బతుకమ్మ ఉయ్యాలో.. నోటిఫికేషన్లు రావాలే ఉయ్యాలో..!
Suryakumar Yadav | దుబాయ్‌కి ‘స్కై’.. విలాసవంతమైన కొత్త ఇల్లు చూశారా..!
First Aid | అత్యవసర పరిస్థితుల్లో ప్రథమ చికిత్స అందిస్తే.. జాగ్రత్తలు తప్పనిసరి..
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

