Chiranjeevi | క్లాస్, మాస్, యాక్షన్, కామెడీ, డ్యాన్స్.. ఇలా ఏ జోనర్‌లోనైనా ప్రేక్షకులను ఇంప్రెస్ చేయాలంటే చిరంజీవి (Chiranjeevi) తర్వాతే ఎవరైనా అంటే అతిశయోక్తి కాదు. ఇండస్ట్రీకి బ్లాక్ బస్టర్ హిట్స్ ఇచ్చి మెగాస్టార్‌గా సక్సెస్ఫుల్ జర్నీని కొనసాగిస్తున్నాడు చిరు. గతేడాది చిరంజీవి టైటిల్ రోల్లో నటించిన భోళా శంకర్ బాక్సాఫీస్ వద్ద బోల్తా కొట్టింది. ఈ స్టార్ యాక్టర్ ప్రస్తుతం విశ్వంభర సినిమాతో బిజీగా ఉన్నాడని తెలిసిందే. మల్లిడి వశిష్ఠ దర్శకత్వంలో సోషియో ఫాంటసీ నేపథ్యంలో వస్తోన్న ఈ మూవీ షూటింగ్ దశలో ఉంది.
తాజాగా చిరు స్టైలిష్ లుక్‌తో కెమెరాకు స్టన్నింగ్ ఫోజులిచ్చాడు. చిరంజీవి బ్లాక్ గాగుల్స్ పెట్టుకుని గ్రీనరీలో మెస్మరైజింగ్ మ్యానరిజంతో ఫొటోలు దిగాడు. ఇప్పుడీ ఫొటోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. ఏజ్ అనేది కేవలం ఓ నంబర్ మాత్రమేనంటూ తాజా స్టిల్స్‌తో చెప్పకనే చెబుతూ.. యంగ్ హీరోలకు పోటీనిచ్చేందుకు రెడీ అంటున్నాడు చిరు . ఇంతకీ చిరంజీవి సర్ప్రైజ్ లుక్‌లో కనిపించడం వెనుక స్పెషలేమైనా ఉందా..? అంటూ తెగ చర్చించుకుంటున్నారు అభిమానులు, సినీ జనాలు.
విశ్వంభర చిత్రాన్ని 2025 జనవరి 10న గ్రాండ్‌గా విడుదల చేయనున్నట్టు మేకర్స్ ఇప్పటికే ప్రకటించారు. ఈ చిత్రాన్ని యూవీ క్రియేషన్స్ బ్యానర్‌పై వంశీ, ప్రమోద్ విక్రమ్ తెరకెక్కిస్తుండగా.. ఆర్ఆర్ఆర్ ఫేం లెజెండరీ మ్యూజిక్ డైరెక్టర్ ఎంఎం కీరవాణి బ్యాక్‌గ్రౌండ్ స్కోర్, సంగీతం అందిస్తున్నారు. ఇప్పటికే లాంచ్ చేసిన విశ్వంభర టైటిల్ లుక్, కాన్సెప్ట్ వీడియో మిలియన్ల సంఖ్యలో వ్యూస్ రాబడుతూ.. సినిమాపై అంచనాలు పెంచేస్తున్నాయి. మరోవైపు దసరా డైరెక్టర్ శ్రీకాంత్ ఓదెల డైరెక్షన్లో ఓ సినిమాకు సంతకం చేశాడు చిరు.
చిరంజీవి స్టైలిష్ లుక్..
Age is truly running backwards for this man, the Mega Star @KChiruTweets#Chiranjeevi garu looks as dapper as it can get, in his latest clicks#MegaStarChiranjeevi pic.twitter.com/U6iO44NpWc
— BA Raju’s Team (@baraju_SuperHit) December 25, 2024
Age is truly running backwards for this man, the Mega Star @KChiruTweets#Chiranjeevi garu looks as dapper as it can get, in his latest clicks#MegaStarChiranjeevi pic.twitter.com/4tdVMUzePG
— Teju PRO (@Teju_PRO) December 25, 2024
Allu Aravind | శ్రీతేజ్ కుటుంబానికి రూ.2 కోట్ల పరిహారం : అల్లు అరవింద్
Aamir Khan | నేను రాత్రంతా తాగేవాడిని.. తన వ్యసనాల గురించి అమీర్‌ఖాన్ షాకింగ్ కామెంట్స్
Drishyam 3 | క్లాసిక్ క్రిమినల్ కమ్ బ్యాక్.. దృశ్యం 3పై మోహన్ లాల్ క్లారిటీ